నటి మీద దారుణమైన దాడి, ముఖం మీద గాయాలతో... (ఫోటోస్)

బాలీవుడ్ నటి, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ మీద లండన్ నగరంలో దారుణమైన దాడి జరిగింది. ఒక వ్యక్తి చేతిలో వేధింపులకు గురైన మహిళను కాపాడటానికి ఆమె ప్రయత్నం చేసే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

దాడికి పాల్పడిన వ్యక్తి సంఘటన స్థలం నుంచి పారిపోగా... లండన్ పోలీసులు అతడిని అరెస్టు చేసిన జైలుకు తరలించారు. ఈ దాడి జరుగడంతో ఆమె అందమైన ముఖంపై తీవ్రమైన గాయాలతో కందిపోయింది.

లండన్లో దాడి

లండన్లో దాడి

ఈ సంఘటన గురించి ఆంగ్లమీడియాతో సోఫియా మాట్లాడుతూ... ‘నేను పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఒక వ్యక్తి ఓ మహిళను వేధిస్తూ కొట్టడం ప్రారంభించాడు. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను వదిలేయాలని హెచ్చరించాను. అయినా అతడు దాడి చేస్తూనే ఉన్నాడు. నేను వెళ్లి అతడిని పక్కకు తోశాను. దీంతో ఆ వ్యక్తి నాపై దాడి చేయడం మొదలు పెట్టాడు.' అని సోఫియా తెలిపారు.

 పోలీసులు వచ్చేలోపే పారిపోయాడు

పోలీసులు వచ్చేలోపే పారిపోయాడు

అతడిని కింద పడగొట్టి గట్టిగా పట్టుకుని పోలీసులకు ఫోన్ చేశాం. పోలీసులు అక్కడికి వచ్చేలోపే అతడు మా నుంచి బలవంతంగా విడిపించుకుని పారిపోయాడు. కొన్ని గంటల తర్వాత అతడిని అరెస్ట్ చేశారని సోఫియా తెలిపారు.

హెల్ప్ చేసినందుకు ఆనందంగా ఉంది

హెల్ప్ చేసినందుకు ఆనందంగా ఉంది

ఆమెకు సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. నాకు ఎక్కడ ఇలాంటి సంఘటన ఎదురైనా తప్పకుండా సహాయం చేస్తాను. మహిళల మీద ఎవరూ దాడి చేయకూడదు. నేను ఎవరికీ భయపడే రకం కాదు అని సోఫియా తెలిపారు.

ఫోటోస్ చూసి షాక్

ఫోటోస్ చూసి షాక్

సోఫియా మీద దాడికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె మొహం మీద గాయాల మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎదుటి వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X