దారుణానికి పాల్పడ్డాడు: భర్తను ఇంటి నుండి గెంటేసిన నటి, ఏం జరిగిందంటే?

By Bojja Kumar

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి సోఫియా హయత్ తరచూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉంటూ ఉంటుంది. ఆ మధ్య సన్యాసం పుచ్చుకున్న ఈ భామ.... తర్వాత దాన్ని వదిలేసి తనకంటే చిన్నవాడైన కుర్రాడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా తన భర్త గురించి ఆమె వెల్లడించిన విషయం చర్చనీయాంశం అయింది. తన భర్త వ్లాడ్ స్టనెస్కును ఇంటి నుండి బయటకు గెంటేసినట్లు ఆమె వెల్లడించారు. అంతే కాదు... అతడో అబద్దాల కోరు, మోసగాడు, డెవిల్ అంటూ ఆరోపణలు గుప్పించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్లాడ్ గురించిన పలు సంచలన విషయాలు సోఫియా బయట పెట్టింది.

అతడు నన్ను మోసం చేశాడు, రేప్ చేశాడు

అతడు నన్ను మోసం చేశాడు, రేప్ చేశాడు

వ్లాడ్ ఒక దొంగ. మోసగాడు, అతడు అప్పుల్లో ఉన్నాడు... దాని కోసం నన్ను వాడుకున్నాడు. ఓసారి నన్ను రేప్ చేశాడు. అతడిని పెళ్లి చేసుకోవడానికి ముందే కొందరు నన్ను హెచ్చరించారు. కానీ నేను వినిపించుకోలేదు. నాకు అలా రాసి పెట్టి ఉందని అనుకుంటాను. మొత్తానికి అతడి నిజస్వరూపం బయట పడింది.... అని సోఫియా తెలిపారు.

ఇంటీరియర్ డిజైనర్ అని అబద్దం చెప్పి

ఇంటీరియర్ డిజైనర్ అని అబద్దం చెప్పి

ఇంటీరియర్ డిజైనర్ అంటూ అబద్దం చెప్పి నాతో పరిచయం పెంచుకుని దగ్గరయ్యాడు. కానీ చివరకు అతడు దొంగ అని నాకు అర్థమైంది. అతడి నిజస్వరూపం తెలిసిన తర్వాత ఇంటి నుండి బయటకు గెంటేశాను అని సోఫియా తెలిపారు.

శారీరకంగా, మానసికంగా హింస

శారీరకంగా, మానసికంగా హింస

అతడి అప్పులు తీర్చుకోవడం కోసం నా డబ్బును వాడుకున్నాడు. నన్ను శారీరకంగా, మానసికంగా హింసించాడు. అతడి వల్ల కడుపులో ఉన్న నా బేబీని కూడా కోల్పోవాల్సి వచ్చింది, అందుకే బయటకు గెంటేశాను అని సోఫియా తెలిపారు.

రెండో సారి ప్రేమలో మోసపోయాను

రెండో సారి ప్రేమలో మోసపోయాను

ప్రస్తుతం సోఫియా వ్లాడ్ చేసిన మోసం నుండి, అతడి వల్ల జరిగిన నష్టం నుండి క్రమక్రమంగా కోలుకుంటోంది. ప్రేమలో మోసం పోవడం ఆమెకు ఇది రెండోసారి. అంతే కాదు... ఇకపై మంచి వ్యక్తిగా జీవించు, ఇతర అమ్మాయిల జీవితాలతో ఆడుకోకు అని వ్లాడ్‌కు అడ్వైజ్ కూడా ఇచ్చిందట సోఫియా.

 వ్లాడ్ ఎక్స్‌గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ కూడా బయట పెట్టింది

వ్లాడ్ ఎక్స్‌గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ కూడా బయట పెట్టింది

సోఫియాకు వ్లాడ్ ఎలాంటి వాడో వెల్లడిస్తూ... అతడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌కు ఓ మెసేజ్ పెట్టింది. అతడు తనను ఎలా మోసం చేశాడు, ఏమేం దొంగిలించాడో వెల్లడిస్తూ అందులో పేర్కొంది. ఈ సందేశాన్ని సోఫియా సోషల్ మీడియా ద్వారా బయట పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X