9 ఏళ్ల వయసులో రేప్ గురయ్యా.. పాకిస్థాన్‌లో భయంకర సంఘటనను బయటపెట్టిన సల్మాన్ మాజీ ప్రేయసి

బాలీవుడ్ నటి, సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు, పాకిస్థాన్‌కు చెందిన సోమీ ఆలీ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తన బాల్యంలో లైంగిక దాడికి గురయ్యానని ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ జాతీయ మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సోమీ ఆలీ చెప్పిన విషయాలకు సంబంధించి వివరాల్లోకి వెళితే...

పాకిస్థాన్ నుంచి అమెరికాకు

పాకిస్థాన్ నుంచి అమెరికాకు

పాకిస్థాన్‌లోని కరాచీలో సోమీ ఆలీ జన్మించింది. 12 ఏళ్ల వయసులో అమెరికాలోని ఫ్లోరిడాకు వలసపోయారు. యవ్వనంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌పై మోజు పెంచుకొన్నారు. ఆ తర్వాత ముంబై చేరుకొని హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. బాలీవుడ్‌లో 1991 నుంచి 1998 వరకు 10 సినిమాల్లో నటించారు.

సల్మాన్ ఖాన్‌తో 8 ఏళ్లు డేటింగ్

సల్మాన్ ఖాన్‌తో 8 ఏళ్లు డేటింగ్

బాలీవుడ్‌లో కెరీర్‌ను కొనసాగిస్తూనే సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేసింది. అప్పట్లో సల్మాన్ ఖాన్, సోమీ ఆలీ అఫైర్ గురించి బాలీవుడ్ మీడియాలో కథలు కథలుగా చెప్పుకొన్నారు. దాదాపు 8 సంవత్సరాలపాటు సల్మాన్‌తో అఫైర్ కొనసాగించింది.

స్వచ్ఛంద సేవలో సోమీ ఆలీ

స్వచ్ఛంద సేవలో సోమీ ఆలీ

బాలీవుడ్‌లో కెరీర్ సవ్యంగా సాగుతుండగానే అనూహ్యంగా హిందీ సినీ పరిశ్రమను వదిలేసింది. ప్రస్తుతం నో మోర్ టియర్స్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నది. రేప్ బాధితులకు ఓదార్పు, అండగా ఉండేలా తన సంస్థను నిర్వహిస్తున్నారు.

పాకిస్థాన్‌లో రేప్ గురయ్యా

పాకిస్థాన్‌లో రేప్ గురయ్యా

తాజాగా జాతీయ మీడియాతో సోమీ అలీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో ఐదేళ్ల వయసులో ఉండగా లైంగిక వేధింపులకు గురయ్యాను. పనివాళ్లకు సంబంధించిన క్వార్టర్స్‌లో మూడుసార్లు లైంగిక దాడికి గురయ్యా. నా తల్లిదండ్రులకు చెబితే... ఎవరికీ చెప్పవద్దు అంటూ చెప్పారు. ఆ తర్వాత నాపై దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొన్నారు. ఆ తర్వాత మళ్లీ 9 ఏళ్ల వయసులోను, అలాగే 14 ఏళ్ల వయసులో నేను రేప్‌కు గురయ్యాను అంటూ సోమీ ఆలీ చెప్పారు.

అందుకే బాలీవుడ్‌కు గుడ్‌బై

అందుకే బాలీవుడ్‌కు గుడ్‌బై

బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడంపై సోమీ ఆలీ స్పందిస్తూ.. నా తీరు డైరెక్టర్లకు తలనొప్పిగా ఉండేది. నేను రిహార్సల్ చేయడానికి ఇష్టపడక పోవడం కష్టంగా మారింది. అమెరికా కల్చర్‌లో పెరిగి అల్లరి పిల్లగా మారాను. చాలా సంఘటనల తర్వాత సినిమా పరిశ్రమకు పనికి రాననని అర్ధమైంది. అందుకే నేను బాలీవుడ్‌ను వదిలేసాను అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X