Just In
- 3 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 3 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 4 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 5 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
కరోనా వ్యాక్సిన్ డ్రైవ్: 12.7 మందికి టీకా, ఏడో రోజు 2 లక్షలకుపైగా హెల్త్‌కేర్ సిబ్బందికి వ్యాక్సిన్
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా దేహం.. నా క్లీవెజెస్.. నీకెందుకు నొప్పి.. నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం
సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి జరుగుతుందో.. అంతే స్థాయిలో చెడు కూడా జరుగుతుంది. తాజాగా ఓ సింగర్ తనకు జరిగిన ఓ చేదు ఘటన గురించి చెప్పుకుంది. అయితే దానిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. నెగెటివ్ కామెంట్లు చేస్తూ ట్రోలింగ్ చేస్తున్న వారిపై సదరు సింగర్ ఫైర్ అయింది. ఇంతకీ ఆ సింగర్ ఎవరో కాదు.. బాలీవుడ్‌లో ఫేమస్ అయిన సోనా మోహపాత్ర. నిన్నటి ట్విట్టర్‌లో జరిగిన ఓ ట్రెండింగ్ టాపిక్‌లో సోనా మోహాపాత్ర తనకు జరిగిన ఓ చేదు అనుభవం గురించి చెప్పింది.

చేదు ఘటనలపై..
మహిళలకు ఎదురుయ్యే అనుభవాలు, చెప్పుకోలేని ఘటనలుంటాయని వాటిపై బాధితులు ఎప్పుడూ నోరు విప్పరని ఓ క్యాంపైన్ చేశారు. #INeverAskForIt అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేశారు. ఇందులో చాలా మంది మహిళలు పాల్గొన్నారు. తమకు జరిగిన ఘటనలు, ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. అందులో భాగంగా సోనా మోహపాత్ర తన గతంలోని ఓ సంఘటన గురించి చెప్పింది.

అలా విజల్ వేశారు..
నా బీటెక్ టైంలో నా ల్యాబ్ మీదుగా ముందుకు వెళ్తున్నాను.. ఆ సమయంలో లూజ్ కుర్తా.. సల్వార్ ధరించాను.. సీనియర్స్ నన్ను చూసి విజిల్స్ వేశారు.. నా బ్రా సైజ్ గురించి వారు గట్టిగా అరిచారు. నా స్నేహితుడొకడు నా దగ్గరకు వచ్చి.. నా దుపట్టాను ఎందుకు సరిగ్గా ధరించలేదని అడిగాడు.. ఎందుకు వాటిని కవర్ చేసుకోకుండా వేసుకున్నావ్ అని అడిగాడంటూ సోనా మోహపాత్ర తనకు జరిగిన ఘటన గురించి వివరించింది.

నెటిజన్ల ట్రోలింగ్..
అలా సోనా తనకు జరిగిన ఘటనను వివరిస్తూ.. మిగతా వారిని కూడా చెప్పమని కొందరిని ట్యాగ్ చేసింది. సోనం కపూర్, సింగర్ చిన్మయి వంటివారిని ట్యాగ్ చేస్తూ ఈ ట్రెండింగ్‌ను ముందుకు తీసుకెళ్లింది. అయితే సోనా చెప్పిన ఘటనపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తూ ట్రోల్ చేశారు. అందులో కొందరు మరీ హద్దులు దాటారు.

నా ఇష్టం నేను చూపిస్తా..
పబ్లిక్ అటెన్షన్ తెచ్చుకోవాలని.. వార్తల్లో నిలుస్తూ వైరల్ అవ్వాలని ఇలాంటి స్టంట్స్ చేస్తోందని నెటిజన్లు విరుచుకుపడ్డారు. మీరు షేర్ చేసే అన్నీ ఫోటోల్లో క్లీవేజ్ కనిపిస్తాయి..ముందు అది చూసుకోండని హితవు పలికాడు. అది నా బాడీ నా ఇష్టం నా క్లీవేజ్. నాకు నచ్చినట్టుగా ఉంటాను రివర్స్ కౌంటర్ వేసింది.