Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
సెక్స్ గురించి తల్లిదండ్రులతో ఎప్పుడూ మాట్లాడలేదన్న సోనాక్షి... కానీ కాలేజీ రోజుల్లో!
కాలం గడిచే కొద్ది భారతీయ సినీ రంగంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో చర్చించడానికి ఇష్టపడని ఋతుస్రావం, బహిరంగ మల విసర్జన లాంటి విషయాలను కూడా ఇపుడు బిగ్ స్క్రీన్ వరకు తీసుకొచ్చారు. ఎలాంటి అంశాలైనా నిర్మొహమాటంగా సినిమాల్లో చర్చిస్తున్నారు.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రస్తుతం నటిస్తున్న 'ఖాందానీ షాఫాఖానా' మూవీ కూడా ఇలాంటి కాన్సెప్టుతో రాబోతోంది. 'సెక్స్' అనే అంశాన్ని ఓపెన్‌గా చర్చిస్తూ సాగుతుంది. సెక్స్ అంశంపై ఫన్నీ కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 2న విడుదల కాబోతోంది. ఇందులో సోనాక్షి సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడే పాత్రలో కనిపించబోతోంది.
అమ్మ నాన్నతో సెక్స్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు
‘ఖాందానీ షాఫాఖానా' సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ... ‘తన తల్లిదండ్రులతో సెక్స్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. ఇలాంటి విషయాలన్నీ ఎక్కువగా తన సహచరులతోనే పంచుకునేదాన్ని అని వెల్లడించారు.
అప్పుడే మనం సెక్స్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటాం
‘ప్రతి ఒక్కరూ వారు ఎదిగే క్రమంలో సహ చరులతో సెక్స్ సంబంధమైన విషయాలు మాట్లాడతారు. కాలేజీ, స్కూల్ రోజుల్లో ఇదంతా సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. వారితో ఆ విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడటం వల్ల మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. కానీ ఈ విషయాలు తల్లిదండ్రులతో మాట్లాడలేం. అలా జరిగేది కాదు అంతే.' అని సోనాక్షి సిన్హా తెలిపారు.
నేను మాత్రమే కాదు, ఈ దేశంలో చాలా మంది అంతే
నేను మాత్రమే కాదు... మన దేశంలో చాలా మంది తమ తల్లిదండ్రులతో సెక్స్ గురించి మాట్లాడరు. అక్కడ అలాంటి పరిస్థితి ఉండదు. అందుకే ఈ విషయాలన్నీ బయటి నుంచి తెలుసుకుంటారు. కానీ తల్లిదండ్రులే సెక్స్ గురించి పిల్లతో ఓపెన్‌గా మాట్లాడి వారికి అన్ని విషయాలు చెబితే ఎన్నో అనర్దాలను మనం అరికట్టవచ్చని సోనాక్షి తెలిపారు. ఈ సినిమా చూసిన తర్వాత మా తల్లిదండ్రులతో పాటు చాలా మంది తల్లిదండ్రుల్లో మార్పు వస్తుందని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఖాందానీ సఫాఖానా
ఖాందానీ సఫాఖానా సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రానికి శిల్పి దేశ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్ నిర్మాత. సోనాక్షితో పాటు వరుణ్ శర్మ, అన్ను కపూర్, బాద్ షా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుందియాల్ ప్రొడక్షన్స్, టీ సిరీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.