అక్షయ్ కుమార్-అజయ్ దేవగణ్ ట్వీట్లు.. తాప్సీ సొనాక్షి సిన్హా కౌంటర్స్
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళన, నిరసన దీక్షలు చర్చకు వస్తున్నాయి. డిల్లీ పరిసరాల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. అలా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తరాదిలో జరుగుతున్న రైతుల ఆందోళన ప్రస్తుతం అంతర్జాతీయానికి పాకింది. పాప్‌స్టార్ రిహన్నా, పర్యావరణ వేత్త గ్రేటా థంబెర్గ్ రైతు ఉద్యమానికి మద్దతుగా ట్వీట్లు చేయడం వివాదంగా మారింది.
రిహాన్నా, గ్రేటా ట్వీట్లపై భారత విదేశాంగశాఖ అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత దేశం గురించి ఏ మాత్రం తెలియని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం దురుదృష్టకరం అని వ్యాఖ్యానించింది. అయితే రిహన్నా, గ్రేటా ట్వీట్లకు వ్యతిరేకంగా భారత ప్రముఖులు ట్వీట్లు చేశారు. అయితే వారు చేసిన ట్వీట్లు కూడా అన్నీ ఒకేలా ఉన్నాయి. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ వంటి సెలెబ్రిటీలందరూ కూడా ఒకే ట్వీట్‌ను కాపీ పేస్ట్‌లా చేసేశారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వీరంతా ఇలా చేస్తున్నారని కొందరు ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.

అందులో భాగంగా సోనాక్షి సిన్హా, తాప్సీలు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఎవరైన మన తప్పులను వేలెత్తి చూపిస్తే.. సరి చేసుకోవడం మానేసి. తిరిగి వారిపై దాడి చేస్తున్నాం.. ఎప్పుడైనా రైతు చేస్తోన్న దీక్షలపై స్పందించారా? అంటూ తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి ఇప్పుడు ఇలా భిన్నరకాల అభిప్రాయాలు వ్యక్త పరచడంతో బాలీవుడ్‌లో గందరగోళం నెలకొంది. బాలీవుడ్‌లో ఉన్న విబేధాలు మరోసారి ఇలా భగ్గుమన్నాయి.


Click it and Unblock the Notifications











