Sonakshi Sinha: వీడియోతో క్లారిటి ఇచ్చిన బాయ్ ఫ్రెండ్.. త్వరలోమీ దబాంగ్ బ్యూటీతో పెళ్లి?
దబంగ్ సినిమాతో దేశవ్యాప్తంగా అప్పట్లో మంచి గుర్తింపును అందుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న ట్లు తెలుస్తోంది. జాహిర్ ఇక్బాల్ తో గతకొంత కాలంగా ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు గా బాలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఎప్పుడూ కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది లేదు. మరొకవైపు తమ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ ఆ విషయం గురించి ప్రస్తావన తీసుకు రాలేదు.
అయితే ఇటీవల మొత్తానికి సోనాక్షి సిన్హాతో ఎక్కువగా ట్రావెల్ అవుతున్న బాయ్ ఫ్రెండ్ జాహిర్ ఇక్బాల్ అసలు విషయాన్ని బయట పెట్టేసాడు. పుట్టినరోజు సందర్భంగా అతను ఒక వీడియోను కూడా షేర్ చేసుకోవడంతో వీరిద్దరి మధ్య లో ప్రేమ మరింత స్ట్రాంగ్ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సోనాక్షి గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

కానీ ఆ విషయం బయట లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంది. కానీ బాయ్ ఫ్రెండ్ కారణంగా చాలాసార్లు ఆ విషయం బయటి ప్రపంచానికి చాలా ఈజీగా అర్థమైపోయింది. ఇద్దరికి సంబంధించిన ఫోటోలు అయితే గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. అసలు సోనాక్షి ప్రేమలో ఉందా లేదా అనే విషయంపై అనేక రకాల సందేహాలు వెలువడుతున్న సమయంలో జాహిర్ ఇక్బాల్ రీసెంట్ గా ట్రావెల్ చేస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాడు.
అందులో సోనాక్షి బర్గర్ తింటూ ఉండగా సరదాగా బాయ్ ఫ్రెండ్ వీడియో తీశాడు ఇక అతను పోస్ట్ చేస్తూ ప్రత్యేకంగా ఐ లవ్ యు కూడా చెప్పడం విశేషం.. హ్యాపీ బర్త్‌డే సోంజ్జ్ నన్ను చంపనందుకు ధన్యవాదాలు. మేము ఒకరికొకరు తెలిసిన మొత్తం సమయం ఇదే అంటూ ఫ్లైట్‌లో సరదాగా గడుపుతుండగా, చివరి పోస్ట్‌లో, వారు సెల్ఫీకి పోజులిచ్చారు. ఇక ఐ లవ్యూ అని కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఇక ఈ ఏడాదిలోనే వీరి వివాహం జరగబోతున్నట్లు టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











