సోనాక్షి సిన్హాకు బిగిస్తున్న చీటింగ్ ఉచ్చు... ఆధారాలతో సహా..

Recommended Video

సోనాక్షి సిన్హాకు బిగిస్తున్న చీటింగ్ ఉచ్చు..!! || Filmibeat Telugu

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా చీటింగ్ వివాదం మరింత ముదురుతున్నది. గతంలో ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు భారీగా డబ్బు తీసుకొని ముఖం చాటేశారనే ఆరోపణలపై సోనాక్షిపై కేసు నమోదైంది. ఈ వివాదంలో ఇరు పక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సోనాక్షి తన ఇమేజ్‌కు భంగం కలిగించేందుకు చేస్తున్న కుట్ర అని ఆరోపించిన నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులు మరోసారి ధీటుగా స్పందించారు. ఈ వివాదంలో తాజా పరిణామాలు ఏమిటంటే..

 ముఖం చాటేయడంతో నష్టం

ముఖం చాటేయడంతో నష్టం

ఈవెంట్ నిర్వాహకులు ఫిర్యాదు ప్రకారం.. గతేడాది ఢిల్లీలో జరిగే ఈవెంట్ కోసం రెమ్యునరేషన్‌గా సోనాక్షి సిన్హాకు రూ.24 లక్షలు ముట్టజెప్పాం. అయితే ఆ కార్యక్రమానికి ఆమె ముఖం చాటేయడంతో మాకు భారీగా నష్టం జరిగింది. అంతేకాకుండా మా ఈవెంట్ కంపెనీ పరువు కూడా పోయింది. అందుకు ప్రతిఫలంగా మాకు నష్టాన్ని ముట్టజెప్పాలి అని కోర్టులో ఫిర్యాదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ.. నిర్వాహకులవి నిరాధార ఆరోపణలు అని పేర్కొన్నారు.

పరువుకు భంగం కలిగించేందుకు

పరువుకు భంగం కలిగించేందుకు

ఈవెంట్ మేనేజర్ కేసు నమోదు తర్వాత సోనాక్షి సిన్హా నుంచి ఉత్తర ప్రదేశ్ పోలీసులు స్టేట్ మెంట్ తీసుకొన్నారు. తన పరువుకు భంగం కలిగించే కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె స్పందించారు. అయితే సోనాక్షి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. నన్ను అబద్దాల కోరు అని సోనాక్షి అంటున్నది. నాకు డబ్బు ఇవ్వలేదని అబద్ధం ఆడుతున్నది. మేము సొమ్ము చెల్లించినట్టు ఆధారాలు ఉన్నాయి అని ఈవెంట్ నిర్వాహకులు మండిపడ్డారు.

 ధన, అధికార బలంతో...

ధన, అధికార బలంతో...

సోనాక్షి చేసిన నిర్వాకంతో మాకు అన్ని రకాల నష్టం వాటిల్లింది. తండ్రి శతృఘ్న సిన్హాకు ఉన్న పలుకుబడి, ధన బలంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటికి మేము బెదిరిపోయేది లేదు. మాకు జరిగిన నష్టాన్ని మేము రాబట్టుకొనేందుకు చట్టపరంగా ఎంతకైనా వెళ్తాం అని ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ వెల్లడించారు.

 సోనాక్షి సిన్హా కెరీర్ విషయానికి వస్తే..

సోనాక్షి సిన్హా కెరీర్ విషయానికి వస్తే..

ఇక కెరీర్ విషయానికి వస్తే, సోనాక్షి సిన్హా నటించిన ఖాందాన్ షఫాఖనా చిత్రంలో నటించింది. తన మేనమామ మరణాంతరం సెక్స్ క్లినిక్ నడిపే యువతి పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ఆగస్టు 2వ తేదీన విడుదల కానున్నది. అలాగే దంబంగ్ 3 చిత్రంలోనూ, అజయ్ దేవగన్ నటించే భుజ్ చిత్రంలో కూడా నటిస్తున్నది. ఈ చిత్రంలో సంజయ్ దత్, పరిణితి చోప్రా, రానా దగ్గుబాటి, ఆమ్మీ విర్క్ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X