వయసు మీద పడినా అలాంటి సీన్స్.. ఆ ఏజ్‌లో అలా చేయను.. హీరోయిన్ కౌంటర్

బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఇలా ఏదైనా.. ఒక పాయింట్ కామన్‌గా ఉంటుంది. ఆరు పదుల వయసు దాటిన హీరోలు కుర్ర హీరోయిన్లతో ఆడి పాడుతుంటారు. వారి కూతురు వయసుండే హీరోయిన్లతోనూ ప్రేమ సన్నివేశాలు, పాటలు, డ్యాన్సులు వంటివి చేస్తుంటారు. అయితే అది ఎప్పటి నుంచి జరగుతూ వస్తూనే ఉంది. హీరోలకు ఏజ్ పెరుగుతున్నా వయసుకు తగ్గ పాత్రలు పోషించకుండా హీరోయిజం చుట్టే తిరుగుతారు. అదే హీరోయిన్ విషయానికి వస్తే అలా కుదరదు. వయసుతో పాటే పాత్రలూ మారుతూ ఉంటాయి.

ఈ విషయంపై బాలీవుడ్ రెబల్ శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా కాస్త ఘాటుగానే స్పందించింది. సోనాక్షి సిన్హా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచింది చిత్రబృందం. ఈ క్రమంలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

Sonakshi Sinha Comments On Old Age Hero Romance With Young Heroine

తనకు యాభై ఏళ్లు వస్తే.. ఇరవై రెండేళ్ల కుర్రాళ్లతో రొమాన్స చేయనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. యాభై ఐదేళ్ల హీరోలు, ఇరవై రెండేళ్ల అమ్మాయిలకు జతగా నటిస్తుండటాన్ని సోనాక్షి ఇలా ప్రస్తావించిందని తెలుస్తోంది. తమ కూతురు వయసున్న అమ్మాయిలతో రొమాన్స్ చేసే హీరోలపై సోనాక్షి ఇలా పంచ్ విసిరిందని బీ టౌన్‌లో టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X