నెటిజన్ల కామెంట్లతో విసుగెత్తిన స్టార్ డాటర్..ప్రశాంతంగా ఉండండి..ట్విట్టర్ నుంచి వైదొలిగిన సోనాక్షి

బాలీవుడ్‌లో ప్రస్తుతం వ్యవహారం అంతా గరంగరంగా ఉంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం, దానికి బాలీవుడ్‌లో పాతుకుపోయిన నెపోటిజమే కారణమని అందరూ వేలెత్తి చూపుతున్నారు. సుశాంత్‌కు అవకాశాలు రానివ్వకుండా ఒంటర్ని చేసి చంపేశారని ఆరోపిస్తున్నారు. గత కొంత కాలం నుంచి డిప్రెషన్‌‌లో ఉన్న సుశాంత్ గత ఆదివారం (జూన్ 14) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో బాలీవుడ్‌పై నిప్పులు చెరుగుతున్నారు.

బాలీవుడ్‌పై ఫైర్..

బాలీవుడ్‌పై ఫైర్..

సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ వ్యవహార శైలియే కారణమని టాక్ వినిపిస్తోంది. నెపోటిజం, మూవీ మాఫియానే సుశాంత్‌కు అవకాశాలు రాకుండా చేశాయని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, అలియా భట్, మహేష్ భట్ వంటి వారిపై విరుచుకుపడుతున్నారు.

పెరిగిన ఒత్తిడి..

పెరిగిన ఒత్తిడి..

సుశాంత్ ఆత్మహత్య జరిగిన రోజు నుంచి ప్రతీ ఒక్క స్టార్‌పై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్ కలిసి సుశాంత్‌ను కించపరడం, అలియా-కరణ్ జోహర్‌లు సుశాంత్‌పై సెటైర్స్ వేసిన వీడియోలు ఎంతగానో వైరల్ అయ్యాయి. తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్‌ ఏకంగా ఓ ట్వీట్ చేశాడంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 సోషల్ మీడియాలో నెగెటివిటీ..

సోషల్ మీడియాలో నెగెటివిటీ..

అయితే ఈ మేరకు సోషల్ మీడియాలో పెరిగిన నెగెటివిటీని సోనాక్షి సిన్హా తట్టుకోలేకపోయినట్టుంది. సరైన కారణాలైతే చెప్పలేదు గానీ నెగెటివిటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితుల వల్లే సోనాక్షి ఈ నిర్ణయం తీసుకుందని టాక్.

Recommended Video

Prema Pipasi Movie New Trailer
ఇక ప్రశాంతంగా ఉండండి..

ఇక ప్రశాంతంగా ఉండండి..

సోషల్ మీడియా అంతా నెపోటిజం హైలైట్ అవుతున్న వేళ ట్విట్టర్ ఖాతా నుంచి తప్పుకుంటున్నానని హీరోయిన్ సోనాక్షీ సిన్హా ప్రకటించింది. ఈ మేరకు చివరగా ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘నీ చిత్తశుద్ధిని కాపాడుకోవాలంటే వేయాల్సిన తొలి అడుగు నెగటివిటీకి దూరంగా ఉండటమే. ముఖ్యంగా ఈ సమయంలో ట్విట్టర్‌కి దూరంగా ఉండాలి. ఛలో.. నేను నా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేస్తున్నా. బై గైస్... ఇక ప్రశాంతంగా ఉండండి' అని ట్వీట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X