twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా అనుకుంటే అనుకోండి.. నాకు పోయేదేమీ లేదు.. ట్రోలింగ్‌పై స్పందించిన సోనాక్షి పోస్ట్

    |

    బాలీవుడ్‌లో ప్రస్తుతం పరిస్థితులు అంతా వేడెక్కి ఉన్నాయి. ఎంతో ప్రతిభ ఉన్న సుశాంత్ సింగ్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకోవడం, దానికి కారణం బాలీవుడ్ పెద్దలు, నెపోటిజం కారణమని అంతా ఫైర్ అవ్వడం గురించి తెలిసిందే. ఇక స్టార్ కిడ్స్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఇంతటి నెగెటివిటీ నుంచి ఉపశమనం కోసం బాలీవుడ్ రెబెల్ శతృఘ్న సిన్హా కూతరు సోనాక్షి సిన్హా ట్విట్టర్ నుంచి వైదొలిగింది. ఈ నేపథ్యంలో సోనాక్షి భయపడిందని ట్రోల్స్ చేస్తున్నారు.

    Recommended Video

    Sonam Kapoor Trolls: Kangana Ranaut ను చూసి బుద్ది తెచ్చుకో, Shraddha Kapoor కు నీకు తేడా అదే !
    అనుకుంటే అనుకోండి..

    అనుకుంటే అనుకోండి..

    తాను ట్విట్టర్ నుంచి వైదొలగడంపై వస్తోన్న కామెంట్లపై సోనాక్షి స్పందించింది. ‘నేను ట్విట్టర్ నుంచి, నెగెటివిటీ నుంచి ఎలా దూరమయ్యాను..కొంతమంది వారు ఏదో గెలిచినట్లు సంబరాలు చేసుకుంటున్నారు. దానికి నేను సంతోషంగా ఉన్నాను. మీకు అలా అనిపిస్తుంది కదా అనుకోండి.. నాకు పోయేదేమీ లేదు. ఎవరికీ ఏమీ కాదు.

    ఆ శక్తిని లాగేసుకున్నాను..

    ఆ శక్తిని లాగేసుకున్నాను..

    కానీ దాన్ని ఎదుర్కోనివ్వండి, దుర్భాషలాడే, కించపరిచే ఓ చోటునుంచి బయటకు వచ్చాను. మీరు నాకు, నా కుటుంబానికి, నా స్నేహితులకు ఏమి కావాలో చెప్పగలిగేలా మీ శక్తిని నేను తీసివేసాను. నేను మీకు ఎంతో నమ్మకంగా ఇచ్చిన ఆ చోటును, మీరు నాతో మాట్లాడే చెప్పే ఆ సాధనాన్ని తీసేశాను. కాబట్టి ఇక్కడ గెలిచింది ఎవరైనా ఉన్నారా? అంటే అది నేనే.

    అది నన్ను ఏం చేయలేదు..

    అది నన్ను ఏం చేయలేదు..

    మీ నెగెటివిటీ నాకు లేదా నా జీవితానికి ఎన్నడూ ఏం చేయలేదు. అందుకే గత పది సంవత్సరాలుగా సంపాదించిన 16 మిలియన్ల మంది ప్రజలను వదిలించుకోవడానికి అక్షరాలా క్షణం కూడా పట్టలేదు. ఊరికే. అలా చేయడం నాకే మంచిది అయింది. నన్ను ద్వేషించేవారందరికీ ఎంతో ప్రేమ దొరకాలని, కోలుకోవాలని కోరుకుంటున్నాను. లేదా మీరు ద్వేషంతోనే ఇంకా కొనసాగవచ్చు, కాని దయచేసి అది నాకు చేరదని గుర్తుంచుకోండి.

    ప్రేమే సమాధానం..

    ప్రేమే సమాధానం..

    నన్ను ప్రేమిస్తున్న వ్యక్తులకు నాతో టచ్‌లో ఎలా ఉండాలో తెలుసు. మీ ప్రేమ, మద్దతు వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఆ మద్దతు, ప్రేమ కూడా ఎప్పటికీ ఉంటుందని నాకు తెలుసు. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీకు వీలైనంత ఎక్కువ మందికి ఆ ప్రేమను పంచాలని నేను మీ అందరిని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఎల్లప్పటికీ ప్రేమే సమాధానం.

    English summary
    Sonakshi Sinha Given Clarity On Quitting From Twitter. Some people are celebrating like they won something... im happy for you, tumhe laga raha hai na... lagne do, kisi ko koi farak nahi padh raha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X