అక్షయ్‌ను కింద పడేసిన స్టార్ హీరోయిన్.. వీడియోను కూడా పోస్ట్ చేసింది.. పాపం హీరో పరిస్థితి చూడండి
వరుస విజయాలతో మాంచి ఫామ్‌లో ఉన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తున్న అతడు తాజాగా నటించిన చిత్రం 'మిషన్ మంగళ్'. జగన్ శక్తి దీనిని తెరకెక్కించాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ రాకేష్ ధావన్ అనే సైంటిస్ట్ పాత్రలో నటించాడు. ఈ మిషన్‌లో భాగస్వామ్యం ఉన్న ఇతర ముఖ్యపాత్రల్లో విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మీనన్,తాప్సీ పన్ను, కీర్తి కుల్హరి నటించారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో పాటు గతంలో వచ్చిన టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. ఇక, సినిమా కొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా సినిమాలో పని చేసిన హీరోయిన్లతో పాటు అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇది జరుగుతున్న సమయంలో ఓ ఊహించని ఘటన జరిగింది. దీంతో ఇంటర్వ్యూలో ఉన్న హీరోయిన్లతో పాటు మిగిలిన వారందరూ షాక్‌కు గురయ్యారు.
ఇంటర్వ్యూ జరుగుతున్న క్రమంలో అక్షయ్.. తన కుర్చీని వెనక్కీ ముందుకు కదులుతున్నాడు. ఈ క్రమంలో అతడు వెనక్కి వాలగానే పక్కనే ఉన్న సోనాక్షి.. అతడి మీద చేయి వేసి వెనక్కి నెట్టేసింది. దీంతో అక్షయ్ కుర్చీతో పాటు వెనక్కి పడిపోయాడు. ఆ సమయంలో తాప్సీ అతడిని పట్టుకోడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

ఈ ఘటనతో అక్షయ్‌తో పాటు అక్కడ ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు. కింద నుంచి అక్షయ్ ఏం చేశావ్ నువ్వు అంటూ ప్రశ్నించాడు. దీంతో సోనాక్షి నన్ను ఎవరైనా ఇరిటేట్ చేస్తే ఇలాగే చేస్తాను అంటూ చెప్పింది. ఆ తర్వాత దీన్ని హీరోగారు లైట్ తీసుకోవడంతో గొడవేం జరగలేదు. ఆ తర్వాత అందరూ నవ్వుకోవడంతో ఇది కామ్ అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను సోనాక్షి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











