అతడి మాటలు నమ్మవద్దు: ఛీటింగ్ ఆరోపణలపై సోనాక్షి సిన్హా

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తనపై వచ్చిన చీటింగ్ ఆరోపణలపై స్పందించారు. యోగ్యత లేని మనుషులు చేసే ఆరోపణలు నమ్మ వద్దని మీడియాను రిక్వెస్ట్ చేశారు. సోనాక్షి తమ వద్ద డబ్బు తీసుకుని ఈవెంటుకు హాజరు కాలేదని, తమను మోసం చేసిందంటూ ఓ ఈవెంట్ ఆర్గనైజర్ ఆమెపై ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిన నేపథ్యంలో పై విధంగా రియాక్ట్ అయ్యారు.

ఈవెంట్ ఆర్గనైజర్ తన కమిట్మెంటును నిలబెట్టుకోలేదు. కావాలనే నా క్లీన్ ఇమేజ్ పాడు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కేసులో నేను అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తప్పు ఎవరిది అనేది త్వరలో తేలుతుంది. మీడియా వారు సదరు ఈవెంట్ ఆర్గనైజర్ చేసే ఆరోపణలను నమ్మవద్దని సోనాక్షి తెలిపారు.

 Sonakshi Sinha reacts on cheating case by twitter

2018లో ఓ స్టేజ్ షోలో పాల్గొనడానికి రూ. 24 లక్షల అడ్వాన్స్‌గా తీసుకున్న సోనాక్షి... హాజరుకాకపోవడంతో యూపీలోని కట్‌ఘర్ పోలీసులకు ఈవెంట్ ఆర్గనైజర్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఐపీసీ సెక్షన్ 420, 406 కింద చీటింగ్ కేసు నమోదు చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి పోలీసులు ముంబైలోని సోనాక్షిసిన్హా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. సోనాక్షి ప్రతినిధి ఈ విషయమై మాట్లాడుతూ... 9 సంవత్సరాలుగా సోనాక్షి బాలీవుడ్ ఇండస్ట్రీలో పని చేస్తున్నారు, ఎంతో నిజాయితీగా ఉన్నారు, ఇతరులను చీటింగ్ చేయాల్సిన అవసరం ఆమెకు లేదు. సోనాక్షి ప్రతిష్టను కించ పరచడం ద్వారా ఆమె ద్వారా డబ్బు గుంజే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X