twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకి వేధింపులు.. యువకుడి అరెస్ట్

    |

    బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను వేధించిన ఓ యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తనను వేధిస్తున్న యువకుడిపై సోనాక్షి చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ వ్యక్తిని మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఆన్‌లైన్‌లో వేధింపులకు వ్యతిరేకంగా సోనాక్షి ఆగస్టు 7వ తేదీన అబ్ బస్ (ఇక చాలూ) అంటూ పెట్టిన పోస్టుపై యువకుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అదేపనిగా వ్యాఖ్యలు చేస్తుండటంతో సోనాక్షి ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యకరమైన కామెంట్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    సోనాక్షి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు ఆ వ్యక్తిని ఔరంగబాద్‌కు చెందిన శశికాంత్ గులాబ్ జాదవ్‌గా గుర్తించారు. ఓ రెస్టారెంట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నట్టు తెలుసుకొన్నారు. ఆ తర్వాత ఔరంగబాద్‌లో అతడిని కస్టడీలోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఐపీసీ, ఐటీ యాక్ట్ కింద పలు కేసులను నమోదు చేసినట్టు సమాచారం.

     Sonakshi Sinhas abuser arrested in Aurangabad

    ఆన్‌లైన్‌లో వేధింపుల పర్వ ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అలాంటి వాటికి చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య కేవలం స్త్రీలకే పరిమితం కాలేదు. అన్ని వర్గాల వారికి ఆన్‌లైన్‌లో భద్రత లేకుండా పోయింది. ఇలాంటి వేధింపులను నిలువరించాల్సిన అవసరం ఉంది అంటూ అబ్ బస్ అనే ట్యాగ్‌తో ప్రచారం మొదలుపెట్టింది.

    English summary
    Sonakshi Sinha Ab Tak campaign to restirct the Cyber Bullying. But she was faced abusive comments on her post. In this occassion, she has given complaint to Mumbai Cyber crime police. They investigated the complaint and arrested Shashikant Gulab Jadhav who is in Aurangabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X