Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకి వేధింపులు.. యువకుడి అరెస్ట్
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను వేధించిన ఓ యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తనను వేధిస్తున్న యువకుడిపై సోనాక్షి చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ వ్యక్తిని మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఆన్లైన్లో వేధింపులకు వ్యతిరేకంగా సోనాక్షి ఆగస్టు 7వ తేదీన అబ్ బస్ (ఇక చాలూ) అంటూ పెట్టిన పోస్టుపై యువకుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అదేపనిగా వ్యాఖ్యలు చేస్తుండటంతో సోనాక్షి ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యకరమైన కామెంట్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సోనాక్షి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు ఆ వ్యక్తిని ఔరంగబాద్‌కు చెందిన శశికాంత్ గులాబ్ జాదవ్‌గా గుర్తించారు. ఓ రెస్టారెంట్లో మేనేజర్‌గా పనిచేస్తున్నట్టు తెలుసుకొన్నారు. ఆ తర్వాత ఔరంగబాద్‌లో అతడిని కస్టడీలోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఐపీసీ, ఐటీ యాక్ట్ కింద పలు కేసులను నమోదు చేసినట్టు సమాచారం.
ఆన్లైన్లో వేధింపుల పర్వ ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అలాంటి వాటికి చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య కేవలం స్త్రీలకే పరిమితం కాలేదు. అన్ని వర్గాల వారికి ఆన్లైన్లో భద్రత లేకుండా పోయింది. ఇలాంటి వేధింపులను నిలువరించాల్సిన అవసరం ఉంది అంటూ అబ్ బస్ అనే ట్యాగ్‌తో ప్రచారం మొదలుపెట్టింది.