twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనాక్షి సిన్హా దెబ్బకు ఈవెంట్ మేనేజర్ ఆత్మాహత్యాయత్నం.. స్పందించిన హీరోయిన్ టీం

    |

    సల్మాన్ ఖాన్ సరసన నటించిన దబాంగ్ చిత్రంతో బాలీవుడ్ లోకి సోనాక్షి సిన్హా సంచలనంలా దూసుకొచ్చింది. దబాంగ్ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో.. సోనాక్షి సిన్హాకు ఈ చిత్రంతో అంత క్రేజ్ దక్కింది. ఆ తర్వాత వరుస చిత్రాలతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవల సోనాక్షి సిన్హాపై నమోదైన చీటింగ్ కేసు వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా సోనాక్షి సిన్హా మేనేజ్మెంట్ టీం ఈ వివాదం గురించి స్పందించింది.

    ఐదుగురిపై చీటింగ్ కేసు

    ఐదుగురిపై చీటింగ్ కేసు

    గత ఏడాది ఢిల్లీలో లో నిర్వహించిన ఇండియా ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డుల వేడుకకు సోనాక్షి సిన్హా హాజరు కావాల్సింది. కానీ చివరి నిమిషంలో సోనాక్షి సిన్హా ఈ ఈవెంట్ కు హాజరు కాలేదు. దీనితో సోనాక్షి సిన్హా, మాళవిక పంజాబీ, దుమిల్ ఠక్కర్, అభిషేక్ సిన్హా లపై ఈవెంట్ నిర్వాహకులు చీటింగ్ కేసు నమోదు చేసారు. ఈ వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

    స్పందించిన సోనాక్షి టీం

    స్పందించిన సోనాక్షి టీం

    ఈ వివాదంపై సోనాక్షి సిన్హా మేనేజ్మెంట్ టీం స్పందించింది. ఈవెంట్ నిర్వాహకులు అసత్య ఆరోపణలు చేయడమే కాక,సోనాక్షి ప్రతిష్టని దిగజార్చేందుకు మీడియాని ఉపయోగించుకుంటున్నట్లు సోనాక్షి టీం స్పందించింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకటం ఈవెంట్ నిర్వాహకులు సోనాక్షి సిన్హాకు డబ్బులు చెల్లించలేదు. పైగా తిరుగుప్రయాణానికి టికెట్లు కూడా పంపలేదు. తమ భాద్యతగా ఈవెంట్ నిర్వాహకులకు ముందుగా పలుమార్లు గుర్తు చేశాం. అయినా వారు స్పందించలేదు. అందువలనే సోనాక్షి తన ప్రయాణాన్ని రద్దు చేసుకుందని స్పష్టం చేశారు.

    పోలీసులు సోనాక్షికి అనుకూలంగా

    పోలీసులు సోనాక్షికి అనుకూలంగా

    సోనాక్షిపై దుష్ప్రచారం ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని కూడా ఆమె టీం హెచ్చరించింది. ఇదిలా ఉండగా పోలీసులు దర్యాప్తు జరపకుండా సోనాక్షికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ ఆరోపించారు. దీనితో ఆయన విషం తాగి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ గతంలో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

     అనవసరమైన ఒత్తిడి

    అనవసరమైన ఒత్తిడి

    ఈ ఈవెంట్ కు హాజరయ్యేందుకు నిర్వాహకులు రూ.37 లక్షలతో సోనాక్షి సిన్హాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 30న ఈ ఈవెంట్ ఢిల్లీలో జరిగింది. తాను సోనాక్షి సిన్హాకు 32 లక్షలు చెల్లించానని ప్రమోద్ శర్మ చెబుతున్నారు. ఇక ప్రమోద్ శర్మ ఆత్మహత్యాయత్నంపై పోలీసులు స్పందించారు. తాము సోనాక్షి సిన్హాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమోద్ శర్మ అనవసరంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడి తమపై ఒత్తిడి పెంచాలని చూడడం సరైనది కాదని అంటున్నారు.

    English summary
    Sonakshi Sinha’s agency denies charges of ‘cheating’, says organiser failed to make payment
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X