స్టార్ హీరోయిన్‌కు 10 కోట్ల అప్పు ఉన్న తండ్రి.. మొత్తం ఆస్తి 112 కోట్లు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు, పొలిటీషియన్ శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీ తరుపున బీహార్ లోని పాట్నా నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో శత్రుఘ్న సిన్హా ఇటీవల తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శత్రుఘ్న సిన్హా ఆస్తులకు సంబంధించిన వివరాలు హాట్ టాపిక్ గా మారాయి. అఫిడవిట్ లో శత్రుఘ్న సిన్హా తన కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు. ఇంతకీ శత్రుఘ్న సిన్హా అఫిడవిట్ లో ఎలాంటి వివరాలు ఉన్నాయో ఇపుడు చూద్దాం!

మొత్తం ఆస్తి
శత్రుఘ్న సిన్హా ఇటీవల ఎంపీ అభ్యర్థిగా పాట్నాలో నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ 112 కోట్లుగా పేర్కొన్నారు. అందులో 103 కోట్లు స్థిరాస్తి కాగా, 9 కోట్ల చరాస్తులు ఉన్నాయి. 29 లక్షల షేర్స్, కోటి రూపాయల విలువైన బంగారం ఉన్నట్లు శత్రుఘ్న సిన్హా తన ఆస్థి వివరాలు ప్రకటించారు. బ్యాంకుల్లో దాదాపు 2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్లు పేర్కొన్నారు.

కుమార్తెకు అప్పు
ఇక శత్రుఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. తాను తన కుమార్తెకు దాదాపు 10 కోట్ల అప్పు ఉన్నట్లు శత్రుఘ్న సిన్హా అఫిడవిట్ లో పేర్కొనడం విశేషం. గతంలో తన భార్య సోనాక్షి సిన్హా నుంచి దాదాపు 16 కోట్ల రుణం తీసుకున్నట్లు శత్రుఘ్న సిన్హా పేర్కొన్నారు. అందులో ఇంకా 10 కోట్లు తన కుమార్తెకు చెల్లించాల్సి ఉందని అన్నారు.

వార్షిక ఆదాయం
గతంలో బాలీవుడ్ నటి హేమ మాలిని కూడా తన ఆస్తులు 100 కోట్లకు పైగా ఉన్నట్లు అఫిడవిట్ లో చూపించారు. 2015లో తన వార్షిక ఆదాయం 1 కోటి 28 లక్షలుగా ఉండేదని, ప్రస్తుతం 63 లక్షలకు తగ్గిందని పేర్కొన్నారు. కానీ తన భార్య వార్షిక ఆదాయం మాత్రం 53 లక్షల నుంచి 1 కోటి 14 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో సినీ తారలు ప్రధాన ఆకర్షణగా మారుతున్నారు.

హీరోయిన్‌గా బిజీ
ఇక సోనాక్షి సిన్హా ఎప్పటిలాగే తన చిత్రాలతో బిజీగా గడుపుతోంది. సోనాక్షి సిన్హా చివరగా నటించిన కళంక్ చిత్రం నిరాశపరిచింది. దబాంగ్ 3 చిత్రంలో మరోసారి సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేస్తోంది. దబాంగ్ 3 చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు. అక్షయ్ కుమార్ నటిస్తున్న మిషన్ మంగళ్ లో కూడా సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











