twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్మార్ట్ ఫోన్ వచ్చింది.. సెక్స్ పాఠాలు అవసరం.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

    |

    ఆధునికత రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమని నొక్కి చెబుతోంది బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. తాజాగా తన కొత్త సినిమా 'ఖాందాని షఫాఖానా' ట్రైలర్ లాంచ్‌లో భాగంగా సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల సోనాక్షి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ సోనాక్షి చెప్పిందేంటి? అసలు సెక్స్ ఎడ్యుకేషన్ టాపిక్ ఎందుకు తీసింది? వివరాల్లోకి పోతే..

    సెక్స్ గురించి మాట్లాడాలంటే భయం

    సెక్స్ గురించి మాట్లాడాలంటే భయం

    ఇంత స్పీడ్‌గా ఆధునికత, సాంకేతికత దూసుకుపోతున్న ఈ మోడ్రెన్ సమాజంలో అన్నీ చేస్తారు.. కానీ ఒక్క సెక్స్ గురించి మాట్లాడాలంటే మాత్రం భయపడి పోతుంటారు. సెక్స్ పట్ల నీతులు బోధిస్తూ ఆ టాపిక్ ఎక్కడా మాట్లాడొద్దని ఆంక్షలు పెడుతుంటారు. ఉపదేశాలు ఇవ్వడం కాదు.. ప్రజలకు అర్ధమయ్యే రీతిలో సెక్స్ పాఠాలు చెప్పడం అవసరం అని అంటోంది సోనాక్షి సిన్హా.

    పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌

    పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌

    సెక్స్ ఎడ్యుకేషన్‌ పాఠశాల లెవల్ నుంచే ఒక సబ్జెక్ట్‌గా ఉండాలని, సెక్స్ పాఠాల గురించి పిల్లలకు వివరించాలని సంచలన కామెంట్స్ చేసింది సోనాక్షి. అలా సెక్స్ పాఠాలు చెప్పడం మూలంగా సెక్స్ అనేది చెడు కాదని పిల్లలు అర్థం చేసుకుంటారని ఆమె చెప్పుకొచ్చింది. తన 'ఖాందాని షఫాఖానా' ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నమే చేశామని ఆమె పేర్కొంది. సెక్స్ ఎడ్యుకేషన్‌ ప్రాధాన్యతను వివరిస్తూ సున్నితంగా, వినోద భరితంగా ఈ సినిమా రూపొందించామని చెప్పుకొచ్చింది.

    సోనాక్షి కామెంట్స్‌పై మిశ్రమ స్పందన

    సోనాక్షి కామెంట్స్‌పై మిశ్రమ స్పందన

    సెక్స్ ఎడ్యుకేషన్ పై సోనాక్షి సిన్హా చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై మిశ్రమంగా స్పందిస్తున్నారు జనం. కొందరు తప్పుగా ట్రీట్ చేస్తే మరికొందరు మాత్రం స్కూల్ లెవల్ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమే అని అంటున్నారు. టెక్నాలజీ విస్తృతమై చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో యువత తప్పుదారి పట్టకుండా ఉండాలంటే సెక్స్ ఎడ్యుకేషన్‌ పట్ల కొంతైనా అవగాహన ఉండాల్సిందేనని ఇంకొందరు అంటున్నారు.

    ఖాందాని షఫాఖానా మూవీ

    శిల్పి దాస్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ఖాందాని షఫాఖానా. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా ముఖ్య పాత్ర పోషించింది. ఆగస్టు 2 వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈ మేరకు తాజాగా ట్రైలర్ లాంచ్ చేయగా.. ఆ వేదికపై సోనాక్షి సెక్స్ ఎడ్యుకేషన్ గురించిన టాపిక్ తీసుకొచ్చింది.

    English summary
    Actress Sonakshi Sinha is unfazed about the clash of her upcoming 'Khandani Shafakhana' release with Sidharth-Parineeti starrer Jabariya Jodi on August 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X