twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎప్పుడో చేయాల్సింది.. తండ్రికి మొట్టికాయలు వేసిన సోనాక్షి సిన్హా

    |

    బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన తండ్రి, అలనాటి సూపర్‌స్టార్ శత్రఘ్న సిన్హాకు అండగా నిలిచింది. గత కొన్నేండ్లుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న శత్రఘ్న సిన్హా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల తరుణంలో పార్టీ మారడంపై సోనాక్షి సిన్హా సానుకూలంగా స్పందించారు. బీజేపీ పార్టీని నాన్న ఎప్పుడో విడిచిపెట్టి ఉండాల్సింది అని ఆమె అన్నారు.

    ఎన్నో ఏళ్లుగా అనుబంధాన్ని కొనసాగిస్తున్న ప్రదేశంలో గానీ, వ్యక్తులతో గానీ, సంస్థలతోగానీ నీవు సంతోషంగా లేకపోతే.. దానిని వదిలేయడం మంచిది. మారుతారనే భావనతో అక్కడే ఉండటం శుద్ద దండుగ. ఆలస్యంగా మేలుకొన్నప్పటికీ.. నాన్న మంచి పనే చేశారు. పార్టీకి మంచి పనిచేసినప్పటికీ.. నాన్నకు పేరు రాకుండా కుట్రలు చేశారు అని సోనాక్షి తాజాగా మీడియాతో అన్నారు.

    Sonakshi Sinha supports father Shatrughan Sinha decision

    బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. వచ్చే నెల నవరాత్రి పండుగ శుభసందర్భంలో పార్టీలో చేరుతానని వెల్లడించినట్టు సమాచారం. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్న శత్రుఘ్న సిన్హాకు నరేంద్రమోదీ పార్టీ టికెట్ నిరాకరించినట్టు వార్తలు వచ్చాయి. దాంతో సీనియర్ నేత, హీరో అయిన శత్రుఘ్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకొన్నారు.

    English summary
    Bollywood actor Sonakshi Sinha has come out in support of her father Shatrughan Sinha's decision of quitting the Bharatiya Janata Party (BJP) and joining the Congress. Sonakshi, who was speaking at an award event here, said her father Shatrughan should have left the BJP long ago.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X