Adipurush: ప్రభాస్ సినిమాలో బాలయ్య హీరోయిన్.. ఏ పాత్ర చేస్తుందబ్బా!
పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభం నుంచి తెలుగు చిత్రాలకు మాత్రమే పరిమితం అయిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత నుంచి పంథాను ఒక్కసారిగా మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే వరుసగా భారీ బడ్జెట్ ప్రాజెక్టులనే చేస్తున్నాడు. ఇలా ఇటీవలే ప్రభాస్.. 'రాధే శ్యామ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా దాదాపు రూ. 120 కోట్ల నష్టాలను ఎదుర్కొని.. టాలీవుడ్‌లోనే చెత్త రికార్డును నమోదు చేసుకుంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఒక్కొక్క మూవీని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక, ప్రభాస్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో పౌరాణిక జోనర్‌లో వస్తున్న 'ఆదిపురుష్' ఒకటి. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ మూవీతో మన స్టార్ హీరో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టును ఇందులో చూపించబోతున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితమే కంప్లీట్ అయింది.

భారీ బడ్జెట్‌తో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే, ఇందులో జానకీ అలియాస్ సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ సొట్టబుగ్గల సుందరి కృతి సనన్ చేస్తోంది. ఇప్పటికే వీళ్లంతా షూట్‌ను కంప్లీట్ కూడా చేసుకున్నారు. ఇక, ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. అందులో తెలుగు వాళ్లకు పరిచయం అయిన వాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. వారిలో హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఒకరని తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించింది.
'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సోనాల్ చౌహాన్.. సుదీర్ఘమైన కెరీర్‌లో 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాల్లో నటించింది. అలా తెలుగు వాళ్లకు పరిచయం అయిన ఈ భామ.. ఇప్పుడు ప్రభాస్ 'ఆదిపురుష్'లోనూ నటిస్తుందని తెలిసింది. అయితే, ఆమె ఇందులో ఏ పాత్రను పోషిస్తుంది అన్న విషయం మాత్రం తెలియలేదు. సోనాల్ చౌహాన్ ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొందని అంటున్నారు. ఈ బంపర్ ఆఫర్ గురించి ఆమె ఇటీవలే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











