చస్తానని అనుకోలేదు.. కానీ భ్రమల్లో బతికానని తెలిసింది.. సొనాలి బింద్రే ఎమోషనల్
అందాల తార సొనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడ్డారనే వార్త అభిమానులను, బాలీవుడ్ వర్గాలను కుదిపేసింది. 2018 జూలైలో ఈ వార్త బయటకు రాగానే సన్నిహితులు, కుటుంబ సభ్యులు విషాదానికి లోనయ్యారు. వెంటనే ఆమెను మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తీసుకెళ్లారు. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి బయటపడిన సొనాలి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకొన్నారు. భయంకర పరిస్థితుల గురించి ఏం చెప్పారంటే..

క్యాన్సర్ అని తెలియడంతో షాక్
క్యాన్సర్ సోకిందని తెలియడంతో షాక్ గురయ్యాను. అప్పటి వరకు నేను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటాననే భ్రమలో ఉండేదాన్ని. ఒక్కసారి నేను ప్రాణాంతకమైన వ్యాధికి గురయ్యానని తెలిసి చాలా ఆందోళనకు గురయ్యాను అని సొనాలి బింద్రే మీడియాకు వెల్లడించింది.

వైద్యులు బతకడం కష్టమన్నారు
క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష (పోసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫి) రిపోర్టుల చూసిన తర్వాత కడుపు భాగంలో పూర్తిగా క్యాన్సర్ కణాలు విస్తరించాయి. 30 శాతమే బతకడానికి అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. దాంతో నాకు ఒక్కసారిగా చుక్కలు కనిపించాయి అని సొనాలి వివరించింది.

మరణిస్తానని ఎప్పుడూ అనుకోలేదు
క్యాన్సర్ సోకిందనే విషమ పరిస్థితిలో కూడా నేను ధైర్యంగా ఉన్నాను. ఏ క్షణంలో మరణిస్తానని అనుకోలేదు. మృత్యువు దరి చేరదని గట్టిగా నమ్మాను. కాకపోతే చాలా పోరాడాల్సి ఉంటుందని అనుకొన్నాను. చస్తానని ఏ క్షణంలో భావించలేదు అని సొనాలి చెప్పింది.

క్యాన్సర్ అనుభవం ఓ పాఠం
జీవితంలో అత్యంత విపత్కర పరిస్థితుల్లో నా ఫ్యామిలీ, స్నేహితులు, సన్నిహితులు నాకు బలమైన సపోర్ట్‌గా నిలిచారు. మనోధైర్యాన్ని నాలో నింపారు. క్యాన్సర్ వ్యాధి సోకడం నాకు ఓ మంచి పాఠం. నా దేహంపై మరింత శ్రద్ధపెరిగింది అని సొనాలి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











