ప్రతీక్షణం నొప్పితో తల్లడిల్లుతున్నా.. ఏడుస్తున్నా.. నాపై నాకే జాలి: సొనాలి బింద్రే

బాలీవుడ్ అందాల తార సొనాలి బింద్రే మెటాస్టిక్ క్యాన్సర్‌ బారిన పడ్డారనే విషయం సినీ వర్గాలను, అభిమానులను షాక్‌కు గురిచేసింది. క్యాన్సర్‌‌ను ఎదురిస్తూ ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు. ఆమెలో మానసిక స్థైర్యాన్ని నింపడానికి హృతిక్ మాజీ భార్య సుసాన్ ఖాన్, గాయత్రి ఖాన్ తదితర స్నేహితులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో భావోద్వేగానికి గురై ఓ పోస్ట్ పెట్టింది. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో భాగంగా తాను పడుతున్న బాధను వెల్లడించింది.

నొప్పి బాధ వర్ణనాతీతం

నొప్పి బాధ వర్ణనాతీతం

కొద్ది నెలలుగా నా జీవితంలో మంచి, చెడు, బాధ, సంతోషాలను చూశాను. ఇప్పుడు క్యాన్సర్ వ్యాధితో పడుతున్న బాధ వర్ణనాతీతం. ట్రీట్‌మెంట్ సందర్భంగా కనీసం చేతి వేలిని కూడా కదుపలేకపోతున్నాను. ఆ బాధ భౌతికంగా మొదలై.. మానసికంగా, ఎమోషనల్‌గా మారుతున్నది. కెమోథెరపీ, సర్జరీ తర్వాత నవ్వాలని ప్రయత్నించిన నొప్పి వెంటాడుతున్నది.

ప్రతీ క్షణం యుద్ధమే చేస్తున్నా

ప్రతీ క్షణం యుద్ధమే చేస్తున్నా

క్యాన్సర్‌తో పోరాటంలో ప్రతీ క్షణం నాతో నేను యుద్ధం చేయాల్సి వస్తున్నది. శరీరంలో లేని సత్తాను తెచ్చుకొని సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాను. ఈ యుద్ధం చేయడం వెనుక అసలైన సంతృప్తి తెలుస్తున్నది. ఎప్పుడు సంతోషంగా ఉండాలని అనుకోవడంలో సరికాదు. జీవితంలో ప్రతికూల పరిస్థితులను కూడా మనం స్వాగతించాలి.

 నా జీవితం ఇలా అయిపోయిందని

నా జీవితం ఇలా అయిపోయిందని

నా జీవితం ఇలా అయిపోయిందని నాకు నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. బాధతో తల్లడిల్లిన క్షణాలు వెంటాడుతుంటాయి. నా పరిస్థితి చూసుకొని నాపైనే కాసేపు జాలిపడుతుంటాను. జీవితంలో జరిగే విషయాలను, ఎదురయ్యే పరిస్థితులను మనం ఒప్పుకోవాల్సిందే. భావోద్వేగాలకు గురికావడం తప్పు కాదు. ప్రతికూలంగా ఆలోచించడం తప్పని భావిస్తాను.

 ఇంటికి ఎప్పుడు తిరిగి వెళ్లాలని

ఇంటికి ఎప్పుడు తిరిగి వెళ్లాలని

క్యాన్సర్ వ్యాధికి ఇంకా చికిత్స జరుగుతున్నది. ఎప్పడు ఆరోగ్యం బాగుపడుతుంది. నేను ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లాలనే ఫీలింగ్‌తో ఉన్నాను. మరో టెస్ట్ ఇంకా మిగిలి ఉంది. జీవిత అనుభవాలను విద్యార్థిగా నేర్చుకొంటున్నాను. బాధ నుంచి బయటపడటానికి నిద్ర పోవడం లేదా నా కుమారుడితో మాట్లాడటం చేస్తున్నాను అని సొనాలి బింద్రే ఎమోషనల్‌గా ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది.

సొనాలి బింద్రే నాకు స్ఫూర్తి

తాజాగా సోనాలి బింద్రే, ఆమె భర్త గోల్డీ బెహల్‌ను బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కలుసుకొన్నారు. ఆమె ట్రీట్‌మెంట్, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నాడు. ఓ అందగత్తె ఒత్తిడికి లోనైతే దాని ఫలితం భయం లేకుండా ఉండటం అనేది సొనాలి బింద్రేను చూస్తే అర్ధమైంది. సొనాలి దంపతులతో చేసిన డిన్నర్ అద్భుతం. ఆమె నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది అని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X