twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భర్తతోపాటు భయాందోళనకు గురైన సోనాలి బింద్రే.. 12 ఏళ్ల కొడుకు ఏం చేశాడంటే. క్యాన్సర్ ట్రీట్మెంట్!

    |

    అందాల తారగా బాలీవుడ్ తో పాటు దక్షణాది భాషల్లో కూడా ఓ వెలుగు వెలిగిన సోనాలి బింద్రే తీవ్రమైన క్యాన్సర్ బారీన పడ్డ సంగతి తెలిసిందే. సోనాలి కొన్ని రోజులు క్రితం తనకు క్యాన్సర్ ఉన్న విషయం ప్రకటించగానే సినీ ప్రపంచం షాక్ కి గురైంది. వెంటనే సెలెబ్రిటీలంతా సొనాలికి ధైర్యాన్ని నూరిపోశారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రస్తుతం సోనాలి బింద్రే తన ఫ్యామిలీతో కలసి లండన్ లో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా తన 12 ఏళ్ల కొడుకు గురించి సోనాలి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

     హైగ్రేడ్ క్యాన్సర్

    హైగ్రేడ్ క్యాన్సర్

    సోనాలి బింద్రే బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా కొన్ని మరపురాని చిత్రాల్లో నటించింది. ఇంద్ర, మన్మధుడు, మురారి వంటి చిత్రాలలో సోనాలి బింద్రే నటించిన సంగతి తెలిసిందే. అలాంటి నటికి క్యాన్సర్ సోకడంతో సినీ ప్రపంచం నివ్వెరపోయింది.

    లండన్‌లో చికిత్స

    లండన్‌లో చికిత్స

    తన కుటుంబ సభ్యలతో కలసి సోనాలి బింద్రే లండన్ లో చికిత్స పొందుతోంది. చికిత్స నేపథ్యంలో ఆమె హెయిర్ కట్ చేసుకుని రూపు కూడా మారిపోయింది. తన 12 ఏళ్ల కొడుకు రణవీర్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

    భర్తతో పాటు తాను కూడా

    భర్తతో పాటు తాను కూడా

    తనకు క్యాన్సర్ సోకిందనే విషయాన్ని 12 ఏళ్ల రణవీర్ కు ఎలా చెప్పాలి, చెబితే అతడు తట్టుకోగలడా అనే భయానికి భర్తతో పాటు తాను కూడా గురయ్యానని సోనాలి తెలిపింది.

    ఆశ్చర్యపోయేలా

    నెమ్మదిగా రణవీర్ కు తనకు క్యాన్సర్ సోకిందని విషయాన్ని చెప్పాము. రణవీర్ తాం వయసుకు మించి పరిణితి ప్రదర్శించాడు. అతడి మెచ్యూరిటీ ఆశ్చర్యపరిచింది సోనాలి తెలిపింది. రణవీర్ నాకే కొండంత ధైర్యాన్ని ఇచ్చాడని సోనాలి బింద్రే పేర్కొంది.

    English summary
    Sonali Bendre opens up on how she told son Ranveer about her cancer. Sonali went to London for treatment
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X