క్యాన్సర్ ఎఫెక్ట్: గుండుతో సోనాలి బింద్రే, ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టమే!

By Bojja Kumar

సోనాలి బింద్రేకి కేన్సర్ సోకిందనే విషయం తెలియగనే అభిమానులు షాక్‌లోకి వెళ్లిపోయారు, ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న ఈ మాజీ హీరోయిన్ తాజా ఫోటో చూస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరేమో? కేన్సర్ చికిత్స కోసం అమెరికా వెళుతున్న సమయంలోనే ఆమె తన జుట్టును సగం కత్తిరించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీమో థెరపీ జరుగుతున్న నేపథ్యంలో ఆమె పూర్తిగా తన వెంట్రుకలను తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుండుతో ఉన్న ఆమెను చూసి ఫ్యాన్స్ మరింత కృంగిపోవడం ఖాయం.

Recommended Video

Producer Shrishti Arya Talks About Sonali Bendre's Health
 గుండు చేయించుకున్న అనంతరం సోనాలి ఇలా

గుండు చేయించుకున్న అనంతరం సోనాలి ఇలా

గుండుతో ఉన్న ఫోటోను సోనాలి బింద్రే తన సోషల్ మీడియా పేజీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఈ ఫోటోలో ఆమెతో పాటు సుజానే ఖాన్, నటి గాయత్రి ఒబెరాయ్ లు ఉన్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆమె తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

నా స్నేహితులతో సంతోషంగా ఉన్నాను

నా స్నేహితులతో సంతోషంగా ఉన్నాను

నేను ఆనందంగా ఉన్నాను, వీలైనంత వరకు బాధ పడకుండా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. నా చూట్టూ స్నేహితులు ఉండటం వల్ల ఒంటరిగా ఉన్నాననే భావన కలగడం లేదు. వారు నా కోసం వారి విలువైన సమయం కేటాయిస్తున్నారు అని సోనాలి చెప్పుకొచ్చారు.

జుట్టు లేక పోవడం మరింత ఈజీ

జుట్టు లేక పోవడం మరింత ఈజీ

పూర్తిగా గుండు చేయించుకోవడం సోనాలి రియాక్ట్ అవుతూ.... జుట్టు లేదన్న బాధ లేదు. దీని వల్ల నేను రెడీ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు అంటూ తనలో ధైర్యాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తోంది సోనాలి.

అభిమానులు ధైర్యం చెబుతూ..

అభిమానులు ధైర్యం చెబుతూ..

సోనాలి బింద్రే క్యాన్సర్ 4వ దశలో ఉండటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సోనాలి తన ఫ్యాన్స్ అధైర్య పడకుండా ఎప్పటికప్పుడు తన చికిత్సకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X