For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నువ్వు మాకు దక్కాలి.. ఎంతకైనా పోరాడుతాం.. సొనాలి బింద్రే కోసం..

    By Rajababu
    |

    క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న సొనాలి బింద్రేకు ఆమె స్నేహితులు సుసానే ఖాన్, గాయత్రి ఒబెరాయ్, దియామిర్జా వెన్నంటి ఉండి నైతిక మద్దతు ఇస్తున్నారు. ఆమె ఎలాంటి డిప్రెషన్‌కు గురికాకుండా కంటికి రెప్పలా కాపాడుకొంటున్నారు. గతంలో అమెరికాకు వెళ్లి ఆమెకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సుసానే ఖాన్, గాయత్రితో కలిసి న్యూయార్క్ సిటీలో సెంట్రల్ పార్క్ వద్ద హంగామా చేశారు. ఆ ఫోటోను సుసానే ఖాన్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

     నీవు మాలో ఒకరివి

    నీవు మాలో ఒకరివి

    నీకు మేము.. మాకు నీవు బలం. నీ కోసం పోరాడుతాం. నిన్ను గౌరవిస్తాం. నీవు మాలో ఒకరివి. నీకు మనస్థైర్యం ఇచ్చి ప్రోత్సహిస్తాం. నీవు మాకు కావాలి. మా ప్రేమకు నీవు అర్హురాలి. ఏ పరిస్థితుల్లోనైనా నీ వెంటే ఉంటాం అని గాయత్రి ఒబేరాయ్ ఫోటోను ట్వీట్ చేసి సందేశాన్ని రాశారు.

    Actress Sonali Bendre Thanks Priyanka Chopra
    సొనాలి బింద్రేకు అండగా

    సొనాలి బింద్రేకు అండగా

    గతంలో ఫ్రెండ్ షిప్ డే రోజున కష్టాల్లో ఉన్న సొనాలి బింద్రేను అమెరికాలో కలిశారు. ఆ సందర్భంగా ఓ రకమైన డిప్రెషన్ నుంచి బయటకు లాక్కొచ్చారు. ఆ సంఘటనను గుర్తు చేసుకొంటూ .. ప్రతికూల పరిస్థుతుల్లో నాకు బలంగా నిలిచిన నా స్నేహితులకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు సహాయం చేసేందుకు వారు తమ వ్యక్తిగత జీవితాలను పక్కన పెట్టారు అని సొనాలి ట్వీట్ చేశారు.

    ప్రస్తుతం కిమోథెరపీ చికిత్స

    ప్రస్తుతం కిమోథెరపీ చికిత్స

    క్యాన్సర్ వ్యాధికి లోనైన సొనాలి బింద్రేకు ప్రస్తుతం కిమోథెరపీ చికిత్స జరుగుతున్నది. చికిత్స కోసం ఆమె జుట్టును తొలగించి గుండు చేసుకొన్నది. గుండుతో సొనాలిని చూడలేని ప్రియాంక చోప్రా కొద్దిరోజుల క్రితం ప్రత్యేకంగా విగ్గును అందించింది. ప్రియాంక చోప్రా తన కోసం విగ్‌ తీసుకురావడంపై ఉద్వేగానికి లోనైంది.

    సొనాలికి అండగా గోల్డీ బెహల్

    సొనాలికి అండగా గోల్డీ బెహల్

    అమెరికాలో చికిత్స పొందుతున్న సొనాలి బింద్రే వెంట ఆమె భర్త గోల్డి బెహల్ ఉంటున్నారు. అన్నివేళలా సొనాలికి అండగా నిలుస్తున్నారు. గోల్డి బెహల్ బాలీవుడ్ దర్శక, నిర్మాత అనే విషయం తెలిసిందే. అభిషేక్ బచ్చన్‌కు గోల్డీ బాల్య స్నేహితుడు. అభిషేక్, రాణి ముఖర్జి, సుస్మిత సేన్, జాకీ ష్రాఫ్‌తో బస్ ఇత్నా ఖాబ్ హై అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

    English summary
    Sonali Bendre battles cancer with BFF Sussanne Khan by her side. BFFs Sonali Bendre and Sussanne Khan posed for a new photo in New York’s Central Park.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X