ప్రపంచంలోని గొప్ప భర్త.. కావాల్సినవన్నీ ఇస్తాడన్న సోనమ్ కపూర్

బాలీవుడ్ క్యూట్ కపూల్‌లో సోనమ్ కపూర్ ఆనంద్ అహూజా జంట ఉంటుంది. ప్రేమ వివాహమే అయినా పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వీరి వివాహా వేడుక జరిగింది. కపూర్ ఫ్యామిలీ కాబట్టి పెళ్లి వేడుకకు బాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. ఇక పెళ్లి అనంతరం వీరిద్దరు విదేశాలబాట పట్టి తెగ ఎంజాయ్ చేశారు. సోనమ్ తనభర్తతో దిగిన ఫోటోలను సంతోషంగా ఉన్న క్షణాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నేడు సోనమ్ కపూర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

తండ్రి అనిల్ కపూర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. 'ఒక కూతురిగా నీకంటే ఎవరూ బాగా ఉండలేరు. ఆనంద్‌ అహుజాకు సరైన భాగస్వామి. సినిమా తెరపై ఒక స్టార్‌. నువ్వు నా నమ్మకం, ఆనందం, నీకు తండ్రిగా ఉండటం గర్వంగా ఉంది. అలాగే నన్ను భయపెట్టే ఏకైక వ్యక్తి. ఇప్పుడు మాస్టర్‌ చెఫ్‌ కూడా అయ్యావు. పుట్టినరోజు శుభాకాంక్షలు సోనమ్‌‌. ఈ రోజు నువ్వు మా అందరితో ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తునే ఉంటా'నని తెలిపాడు.

Sonam Kapoor About Anand Ahuja On Her birthday

ఇక సోనమ్ మాత్రం తన భర్తతో అన్యోన్యంగా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ..' ప్రపంచంలోనే మంచి మంచి భర్తవి నువ్వు. నాకు అవసరమున్న ప్రతీది ఇస్తావు. నా బర్త్ డే కానుకవి నువ్వు. నేను నిన్ను మొదటి సారి హగ్ చేసుకున్నప్పటి నుంచీ ప్రేమిస్తూనే ఉన్నాన'ని చెప్పుకొచ్చింది. ఇక సోనమ్ బర్త్ డే సందర్భంగా బాలీవుడ్ మొత్తం ఆమెకు విషెస్ చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X