twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి ఫ్యామిలీలో వేడుక: హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి డేట్, ప్లేస్ ఫిక్స్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Sonam Kapoor Wedding In Geneva, Dates Out

    శ్రీదేవి మరణంతో విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు ఆ బాధ నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. త్వరలో ఈ విషాదాన్ని పూర్తిగా మరిచిపోయి వేడుకలో మునగబోతోన్నారు. హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. సోనమ్ కపూర్.... శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కూతురు అనే సంగతి తెలిసిందే.

     సోనమ్ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ?

    సోనమ్ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ?

    బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కొన్ని రోజులుగా తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి పెళ్లి డేట్, వెన్యూ ఫిక్స్ అయింది. మే 11, 12 తేదీల్లో జెనీవాలో వీరి వివాహం జరుగబోతోందని తెలుస్తోంది.

    ఇద్దరూ డిసైడ్ అయ్యారు

    ఇద్దరూ డిసైడ్ అయ్యారు

    ప్రముఖ ఆంగ్లపత్రిక ముంబై మిర్రర్ కథనం ప్రకారం...గత వారం సోనమ్ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాతో కలిసి లండన్‌కు హాలిడే ట్రిప్ వెళ్లారు. ఈ సందర్భంగా వారు తమ పెళ్లి గురించి ఓ నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాలో గడుపుతున్నారు.

    మాస్ ప్లైట్ బుకింగ్స్

    మాస్ ప్లైట్ బుకింగ్స్

    పెళ్లి వేడుక సందర్భంగా అతిథులందరినీ జెనీవా తీసుకెళ్లాలి కాబట్టి భారీ ఎత్తున ఫ్లైట్ బుకింగ్స్ చేయడం ప్రారంభించారని తెలుస్తోంది. సోనమ్ కపూర్ తండ్రి అనిల్ కపూర్ గెస్టులకు స్వయంగా ఫోన్లు చేస్తూ తన కూతురి పెళ్లికి ఇన్వైట్ చేస్తున్నారట.

     ఎంగేజ్మెంట్ ఎప్పుడో?

    ఎంగేజ్మెంట్ ఎప్పుడో?

    సంగీత్, మెహందీ లాంటి కార్యక్రమాలతో ట్రెడిషనల్ హిందూ వెడ్డింగ్‌లా ఈ పెళ్లి వేడుక జరుగబోతోంది. అయితే పెళ్లి వేడుక ముందే కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ వేడుక జరుగనుందట. అయితే వెన్యూ ఎక్కడ అనే విషయం ఇంకా బయటకు రాలేదు.

    జెనీవాలో ఎందుకు?

    జెనీవాలో ఎందుకు?

    అయితే జెనీవాలో పెళ్లి ఎందుకు? అని చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. అందుకు గల కారణాలు పరిశీలిస్తే.... సోనమ్ కపూర్ స్విస్ లగ్జరీ వాచ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్. ఇటీవలే ఈ కంపెనీ జెనీవాలో కూడా ఏర్పాటయింది. ఈ కారణంతోనే ఆమె తన పెళ్లి అక్కడ ప్లాన్ చేసుకున్నట్లు భావిస్తున్నారు.

     వెడ్డింగ్ ఔట్‌ఫిట్స్ డిజైన్ చేసేది

    వెడ్డింగ్ ఔట్‌ఫిట్స్ డిజైన్ చేసేది

    సోనమ్ వెడ్డింగ్ ఔట్ ఫిట్స్ ఎవరు డిజైన్ చేస్తారు? అనే విషయం కూడా చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.... అబు జాని, సందీప్ ఖోస్లా, బ్రిట్ డిజైనర్ ద్వయం టమారా రాల్ఫ్, మైఖేల్ రుస్సో పేర్లు వినిపిసస్తున్నాయి.

     ఇద్దరి విషయం అపుడు బయట పడింది

    ఇద్దరి విషయం అపుడు బయట పడింది

    చాలా ఏళ్ల నుండి సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజా మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అనిల్ కపూర్ 60వ పుట్టినరోజు సందర్భంగా లండన్లో వీరు తమ రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలిసేలా చేశారు.

    English summary
    Sonam Kapoor's wedding details are out! The 32-year-old actress who has been dating businessman Anand Ahuja for over two years will tie the knot over a two-day ceremony on May 11 and 12 in Geneva.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X