Sonam Kapoor: సీమంత వేడుకలో అమ్మాయి డ్రెస్ లో అబ్బాయి.. అతను ఎవరంటే?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొన్ని ప్రత్యేకమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సోనమ్ కపూర్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ తో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె చాలా వరకు సినిమాలకు దూరంగా ఉంది. రీసెంట్ గా సోనమ్ కపూర్ మరోసారి సీమంతంకు సంబంధించిన ఫోటోలతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. లండన్ లో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే అందులో అమ్మాయి డ్రెస్ లో కనిపిస్తున్న లియోకళ్యాణ్ ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరోయిన్ గా..
సావరియా సినిమాతో వెండితెరకు పరిచయమైన సోనమ్ కపూర్ ఆ తర్వాత చాలా తొందరగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా కంటెంట్ తో ఆకట్టుకునే సినిమాల్లో కూడా ఆమె మంచి పాత్రల్లో నటించింది. చిన్న హీరోలతో నే కాకుండా అగ్రహీరోలతో కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సోనమ్ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగారు.

స్టార్ హీరో వారసురలిగా..
కపూర్ ఫ్యామిలీకి చెందిన సోనమ్ కపూర్ ఒకప్పటి స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ గారాల కూతురు అని అందరికీ తెలిసిన విషయమే. తండ్రితో కూడా పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఎప్పుడు కూడా పెద్దగా వివాదాలకు తావివ్వకుండా క్రమశిక్షణతోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. అంతే కాకుండా తన ప్రేమ వ్యవహారాన్ని కూడా మొదట్లోనే చెప్పేసి అప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

వ్యాపారవేత్తతో పెళ్లి
ప్రముఖ బిజినెస్ మాగ్నెట్ ఆనంద్ అహుజను వివాహం చేసుకున్న సోనమ్ కపూర్ అంతకుముందు అతనితో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఇక ప్రేమలో కొంతకాలం పాటు మునిగితేలిన అనంతరం ఆమె పెద్దల నిర్ణయంతోనే పెళ్లి చేసుకుంది. హీరోయిన్ గా ఒక రేంజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

సీమంతం వేడుక
అయితే ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న సోనమ్ రెగ్యులర్ గా తన బేబీ బంప్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో అందరినీ ఆశ్చర్యపరిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు సీమంతం వేడుకతో కూడా మరోసారి వార్తల్లో నిలిచింది.

లండన్ లో సెలబ్రేషన్స్
ఇటీవల లండన్ కి వెళ్ళిన సోనమ్ కపూర్ అక్కడే తన బేబీ షవర్ వేడుకను హ్యాపీ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలో తన సన్నిహితులు అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అలాగే ప్రముఖ సింగర్ లియోకల్యాన్ కూడా తన పాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.

లియోకల్యాన్ ఎవరంటే?
అబ్బాయి తరహాలో ఉన్న లియోకల్యాన్ అమ్మాయి తరహా డ్రెస్ లో ఎందుకు కనిపించాడు అని ఒక వర్గం వారు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. అసలు ఇంతకీ అతను ఎవరు అనే వివరాల్లోకి వెళితే.. లియోకల్యాన్ స్వలింగ సంపర్కుడు. అతను బ్రిటీష్ పాకిస్థానీ ముస్లిం గాయకుడు. పాటల రచయితగా మోడల్ గా అలాగే సంగీత నిర్మాతగా సోషల్ మీడియాలో క్రేజ్ అందుకున్నాడు. అతను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దాదాపు 79,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.


Click it and Unblock the Notifications











