ఆ విమానయాన సంస్థపై హీరోయిన్లు ఫైర్.. మాకిది గుణపాఠమంటూ ట్వీట్
బ్రిటీష్ ఎయిర్‌వేస్ నిర్లక్ష్యంపై సెలెబ్రిటీలు ఎంతగా అసహనం వ్యక్తం చేశారో మనం ఇదివరకే చూశాం. అయితే తాజాగా హీరోయిన్‌లు సోనమ్ కపూర్, పూజా హెగ్డేలు సైతం బ్రిటీష్ ఎయిర్‌వేస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల బ్యాగేజీని వారికి అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను వేలెత్తిచూపారు. సంస్థ తీరు ఏం బాగోలేదని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్ రెండు సార్లు తన బ్యాగ్ పోగొట్టిందని తెలిపిన సోనమ్.. మరోసారి అందులో ప్రయాణించబోనని తేల్చి చెప్పింది.
'ఈ నెలలో బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించడం ఇది మూడోసారి.. అందులో రెండుసార్లు వాళ్లు నా బ్యాగ్‌ను పోగొట్టారు. వారి చర్య నాకు గుణపాఠం నేర్పింది. ఇకపై బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించను'అని పేర్కొంది. ఈ ట్వీట్‌కు పూజా హెగ్డే స్పందిస్తూ.. 'అవును. గత నెలలో నా బ్యాగ్‌లను కూడా వాళ్లు పోగొట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వాటిని కొరియర్‌లో పంపించారు. చూస్తుంటే.. ఇదంతా వారికి అలవాటే అనిపిస్తోంది' అని చెప్పుకొచ్చింది.

కాగా, సోనమ్ ట్వీట్‌పై స్పందించిన బ్రిటీష్ ఎయిర్‌వేస్.. బ్యాగేజీ విషయంలో ఆలస్యం జరుగుతున్నందుకు క్షమించాల్సిందిగా కోరింది. బ్యాగేజీ గురించి ఎయిర్‌పోర్ట్‌లో సమాచారం ఇచ్చినప్పుడు.. ట్రాకింగ్ సూచన ఏమైనా చేశారా అని సోనమ్‌ను అడిగింది. వాటికి బదులిస్తూ.. 'అదంతా చేశాను.. కానీ ఆ ప్రక్రియ చాలా అసౌకర్యంగా ఉంది. ఇలాంటివి జరగకుండా.. మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. మీవి చాలా ఘోరమైన సేవలు, నిర్వహణ కూడా చెత్తగా ఉంద'ని ఘాటుగా రిప్లై ఇచ్చింది.


Click it and Unblock the Notifications











