మంటపెడుతోన్న సోనమ్ కపూర్.. క్లీవేజ్ షోతో రచ్చ
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. భర్త ఆనంద్ అహూజాతొ కలిసి చేసే రచ్చ అయినా, బయట వచ్చే ట్రోలింగ్‌లపై బోల్డ్‌గా స్పందించడంలోనైనా సోనమ్ కపూర్ స్టైలే వేరు. తండ్రిపై అనిల్ కపూర్‌పై సోనమ్ కురిపించిన ప్రేమ, కూతురిపై తండ్రి కురిపించే ప్రేమ ఆ మధ్య బాగానే వైరల్ అయింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు హీట్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడు సోనమ్ చేసిన కామెంట్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.
నెపోటిజం గురించి అందరూ మాట్లాడుతూ ఉండటం, అందులో తన పేరును లాగి ట్రోలింగ్ చేయడంపైనా సోనమ్ ఫైర్ అయింది. సోషల్ మీడియాలో అలాంటి సెన్సేషనల్ కామెంట్సే కాకుండా బోల్డ్ హాట్ ఫోటోలతో సోనమ్ చేసే ఫోటో షూట్లు కూడా ఓ రేంజ్‌లో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా సోనమ్ షేర్ చేసిన ఫోటోలు, చేసిన ఫోటో షూట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

మామూలుగానే ఫ్యాషన్ ఐకాన్‌గా ఉండే సోనమ్ ట్రెండ్‌కు తగ్గట్టు డ్రెస్సులను ధరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె వేసుకున్న కోటు చేసిన క్లీవేజ్ షో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలతో పాటు ఆమె పెట్టిన కామెంట్స్ మరింత హల్చల్ చేస్తున్నాయి. ఆడ్రీ హెప్బ్రన్ చెప్పిన కొటేషన్‌ను సోనమ్ పోస్ట్ చేసింది. నన్ను ఎవ్వరైతే నవ్విస్తారు వారినే నేను ప్రేమిస్తాను.. నిజాయితీగా చెబుతున్నాను.. అదే నాకు ఇష్టం.. ఆ నవ్వు ఎన్నో రోగాలను నయం చేస్తుంది.. ఓ వ్యక్తికి నవ్వు ఎంతో ముఖ్యమంటూ నవ్వులు చిందిస్తోన్న ఫోటోలను షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











