నేను ఆ జబ్బుతో బాధపడుతున్నా.. సోనమ్ కపూర్, మీరు అలా చేస్తే!
బాలీవుడ్ తార సోనమ్ కపూర్ యాక్టర్ గానే కాకుండా వ్యక్తిగతంగా పరిణితిని సాధించినట్టు పలు సందర్భాల్లో స్పష్టమైంది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా బోల్డ్‌గా మాట్లాడేస్తుంది. తానేంటో తన గురించి కచ్చితంగా, కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది. తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో సోనమ్ కపూర్ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.
తాజాగా అయోడిన్ లోపంతో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. కాబట్టి శాఖాహారులందరికీ ఓ రిక్వెస్ట్. మీరు తినే ఉప్పులో అయోడిన్ ఉండేలా చూసుకోండి. మనం తినే ఉప్పులో అయోడిన్ ఉంటే అది లోపాన్ని అరికడుతుంది. కాబట్టి నేను ఉయోగించే ఉప్పులో అయోడిన్ ఉండేటట్టు చూసుకొంటున్నాను అని సోనమ్ చెప్పింది. అయోడిన్ లోపాన్ని తగ్గించుకోవాలంటే సరైన ఉప్పును ఉయోగిస్తే చాలు అని తన అభిమానులకు, ఫాలోవర్స్‌కు సలహా ఇచ్చింది.

సోనమ్ కెరీర్ విషయానికి వస్తే.. రూపొందించిన ది జోయా ఫ్యాక్టర్ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 20న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటిస్తున్నది. ఈ చిత్రం 2008లో అనుజా చౌహాన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో సంజయ్ కపూర్ కూడా కీలక పాత్రలో నటించారు.
జోయా ఫ్యాక్టర్ కథ ఏంటంటే.. జోయా సింగ్ సోలంకి అనే రాజ్‌పుత్ యువతి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలో పనిచేస్తుంది. తన ప్రాజెక్టు పనిలో భాగంగా భారతీయ క్రికెట్ జట్టుతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఆ సందర్భంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది సినిమా కథ.


Click it and Unblock the Notifications











