సోనమ్ కపూర్‌కు చేదు అనుభవం.. నీ తండ్రి కష్టం ఇదే.. ట్వీట్లతో చీల్చి చెండాడిన నెటిజన్లు
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌కు ఫాదర్స్ డే రోజు ఊహించిన పరిణామాలు ఎదురయ్యాయి. ఫాదర్సే డే రోజున ఆమె చేసిన ట్వీట్‌ను నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. సోనమ్ ట్వీట్‌పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండటంతో జాతీయస్థాయిలో ట్విట్టర్ ట్రెండింగ్‌గా మారింది. సోనమ్ తీరుపై నెటిజన్ల భారీగా మండిపడుతూ ఆమె ట్వీట్‌ను వైరల్‌గా మార్చారు. ఇంతకు సోనమ్ చేసిన ట్వీట్ ఏమిటి? ఆమె ట్వీట్‌పై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..
Recommended Video

ఫాదర్స్ డే రోజున సోనమ్ ట్వీట్
ఫాదర్ డే రోజున ఒక విషయం చెప్పదలుచుకొన్నాను. నేను తండ్రి చాటు బిడ్డను. ఆయన వల్లే నాకు ఈ హోదా, గుర్తింపు అని గర్వంగా చెప్పుకొంటాను. అది దానిని అవమానంగా భావించాను. కెరీర్ పరంగా, కుటుంబ పరంగా వేటినైతే నేను అనుభవిస్తున్నానో.. అవన్నీ నాకు నా తండ్రి వల్లనే కలిగాయి. ఇవన్నీ సాధించడానికి ఆయన నిరంతరం చాలా కష్టపడ్డారు. అయితే నేను ఎవరికి పుట్టానో. ఎక్కడ పుట్టానో అనేది ఓ ఖర్మ సిద్దాంతం. అందుకు నేను గర్వంగా ఫీలవుతున్నాను అని సోనమ్ ట్వీట్ చేశారు.

నీ తండ్రి లేకపోతే నీకు ఆఫర్లు ఎవరిస్తారు?
బాలీవుడ్‌లో నెపోటిజంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో సోనమ్ ట్వీట్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవును నీ తండ్రి అనే వారు లేకపోతే నీకు బాలీవుడ్‌లో ఎవరు అవకాశాలు ఇస్తారు. నీకు హీరోయిన్ అయ్యే అంత సత్తా ఉందా? సోనమ్ ఎందుకు అవకాశాలు వచ్చాయని కంగన చెప్పిన విషయాన్ని నీవు ఒప్పుకొన్నావు అంటూ మండిపడ్డారు.

మీ నాన్న ఎంత కష్టపడ్డారో..దావుద్ ఇబ్రహింను చూడు
సోనమ్ నీవు చెప్పింది అక్షరాలు వాస్తవం. ఈ ఫోటోను చూస్తే మీ నాన్న ఎంత కష్టపడ్డారో.. ఏ విధంగా కష్టపడ్డారో అర్ధం అవుతుంది. మీ బలానికి కారణమేమిటో ఇప్పుడైనా అర్ధం అవుతుందా? అంటూ ఓ నెటిజన్ దావుద్ ఇబ్రహీంతో అనిల్ కపూర్ కలిసి ఉన్న ఫోటోను తన ట్వీట్‌తో గట్టిగా జవాబిచ్చారు.

శ్రద్ధాకపూర్‌కు, నీకు తేడా అదే
అనిల్ కపూర్‌కు పుట్టడం అనేది నీ ఖర్మ సోనమ్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన శ్రద్దాకపూర్ నీలా బిహేవ్ చేయలేదు. అందుకే మేము ఆమెను విమర్శించడం లేదు. ట్రోల్ చేయడం లేదు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని పట్టించుకోకుండా కేవలం టాలెంట్‌నే నమ్ముకుంది. ఓ గ్యాంగులో చేరి నీలా యువ హీరోలను కించపరచదు. శ్రద్దాకు, నీకు ఉన్న తేడా అదే అంటూ ఓ నెటిజన్ ధ్వజమెత్తారు.

కంగన రనౌత్‌ను చూసి బుద్ది తెచ్చుకో
సోనమ్ నీకు హోదాను, గుర్తింపు ఉపయోగించుకోవడం ఆపేయ్. ఎందుకంటే కంగనకు ఇంగ్లీష్ రాదంటూ కించపరిచావు. కానీ ఆమె నీ విమర్శలపై చాలా హుందాగా సమాధానం ఇచ్చారు. నా ప్రతిభ, ప్లస్ పాయింట్స్‌ను గుర్తించకుండా నాకు ఇంగ్లీష్ రాదని చెప్పడం బాధకలిగించే విషయం. నా లోపాన్ని నేను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాను అని కంగన చెప్పడం చూసి ఎలా ఉండాలో నేర్చుకో అని ో నెటిజన్ గట్టిగా బుద్ది చెప్పే ప్రయత్నం చేశారు.


Click it and Unblock the Notifications











