twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాగేసి నానా రచ్చ చేసిన మలైకా.. సోనమ్ కపూర్‌కు చేదు అనుభవం!

    |

    నాలుగు పదుల వయసులోనూ హాట్ నెస్ తో అదరగొడుతోంది మలైకా. సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో పాపులర్ అయిన మలైకా అరోరా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా పెర్ఫామ్ చేసింది. మలైకా అరోరా చేసిన ప్రత్యేక గీతాలన్నీ బాగా పాపులర్ అయ్యారు. తరచుగా వివాదాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో మలైకా అరోరా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మాజీ భర్త నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో మలైకా డేటింగ్ చేస్తోంది. పబ్లిక్ గానే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మలైకా అరోరా వలన సోనమ్ కపూర్ కు చేదు అనుభవం ఎదురైంది.

    పీకలదాకా మద్యం తాగి

    పీకలదాకా మద్యం తాగి

    ఇటీవల మలైకా అరోరా ఓ పార్టీ సందర్భంగా పీకల దాకా మద్యం తాగేసిందట. ఈ పార్టీలో ఆమె ప్రియుడు అర్జున్ కపూర్ కూడా పాల్గొన్నాడు. అర్జున్ కపూర్ కు చెల్లి వరసయ్యే సోనమ్ కపూర్ కూడా పాల్గొంది. మలైకా మద్యం సేవించి ఆ పార్టీలో ఒక రేంజ్ లో రచ్చ చేసిందట. ఈ సందర్భంగా మలైకా అరోరా, సోనమ్ కపూర్ మధ్య చోటు చేసుకున్న సంఘటన అక్కడున్నవారందరిని ఆశ్చర్యపోయేలా చేసినట్లు తెలుస్తోంది.

    సోనమ్ కపూర్‌కు చేదు అనుభవం

    సోనమ్ కపూర్‌కు చేదు అనుభవం

    పూర్తిగా మద్యం సేవించిన మలైకా కనీసం మనుషులని గుర్తించే స్థితిలో కూడా లేదట. ఓ సందర్భంలో చిందులేస్తూ కిందపడబోయిందట. పక్కనే ఉన్న సోనమ్ కపూర్ మలైకాకు సాయం చేయడానికి ముందుకు వచ్చింది. దీనితో మలైకా నన్ను ముట్టుకోకు అంటూ సోనమ్ కపూర్ ని దూరంగా నెట్టేసినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ తంతు చూసిన అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. మలైకా నిర్వాకంతో సోనమ్ కపూర్ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

    ప్రేమ వ్యవహారం

    ప్రేమ వ్యవహారం

    నాలుగు పదుల వయసులో పెళ్ళై భర్త నుంచి విడిపోయిన మలైకా కుర్ర హీరో అయిన అర్జున్ కపూర్ తో ప్రేమ వ్యవహారాలు మొదలు పెట్టడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సోనమ్ కపూర్ కి అవమానం జరిగిన పార్టీలో అర్జున్ కపూర్ ఏమి చేయలేక చూస్తూ ఉండిపోయాడట. అర్జున్ కపూర్, మలైకా అరోరా త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

    సంతోషం లేకపోవడంతోనే

    సంతోషం లేకపోవడంతోనే

    ఆ మధ్యన మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తామిద్దరి మధ్య సంతోషం లేకపోవడం వలనే అర్భాజ్ ఖాన్ నుంచి విడాకులు పొందినట్లు మలైకా తెలిపింది. ప్రతి రోజు ఇంట్లో సమస్యగా ఉండేదని, మా వాళ్ళ మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడేవారు. విడిపోవడమే మంచిది అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలైకా అరోరా తెలిపింది.

    English summary
    Sonam Kapoor Upset With Cousin Arjun Kapoor's Alleged Relationship With Malaika Arora
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X