twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనాను అలా మాత్రమే ఓడించగలం.. ‘3 ఇడియట్స్’ ఫేమ్ సోనమ్ వాంగ్చుక్ కామెంట్స్

    |

    చైనా-భారత దేశం మధ్య నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంటుంది. సరిహద్దుల వెంబడి చైనా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. అయితే చైనాను ఎదిరించడానికి భారతీయుల చేతిలో రెండు ఆయుధాలున్నాయని '3 ఇడియట్స్' ఫేమ్ సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. '3 ఇడియట్స్' సినిమాకు ప్రేరణగా నిలిచిన సోనమ్ వాంగ్చుక్ ఓ ఇంజనీర్. విద్యావ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆయన చైనాతో పోరాడేందుకు ఉన్న దారులను వివరించాడు.

    మొదటగా ఆర్మీ యుద్దం. భారత ఆర్మీ చైనాతో యుద్దానికి దిగడం. లేదా చైనా ఉత్పత్తులను భారతీయులు పూర్తిగా తిరస్కరించాలి. మన వారి వస్తువులను కొంటున్నాం, ఆర్థికంగా సహకరిస్తున్నాం..వాటితో ఆయధాలు కొంటున్నారు, వారి ఆర్మీపై ఖర్చు పెడుతున్నారు. ఈ క్రమంలో మన సంపదతో మన మీద దాడి చేస్తున్నారు. అందుకే వారి ఉత్పత్తులను బహిష్కరించాలని సలహా ఇచ్చాడు.

    Sonam Wangchuk About India And China War

    సాఫ్ట్ వేర్ ఉత్పత్తులైన టిక్ టాక్ వంటి వాటిని భారతీయులు వాడకూడదు. సాఫ్ట్ వేర్ వస్తువులను వెంటనే బహిష్కరించాలి. ఒక్క ఏడాదిలో హార్డ్ వేర్ వస్తువులను పూర్తిగా వదిలేయాలని సలహాఇచ్చాడు. అంటే మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాలి. దేశీ ఉత్పత్తులనే వాడాలని పేర్కొన్నాడు. ఈ మేరకు ఈ సందేశాన్ని ఓ వీడియో రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Sonam Wangchuk About India And China War. he says that to advice Indians on how to win a war against China on two fronts, first, through Army and second, through people's boycott of Chinese companies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X