Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సోనూ సూద్‌పై అనుమానాలు.. ఇంతవరకు ఎన్ని కోట్లు ఖర్చు చేసావ్? బయటపడిన అసలు లెక్కలు
ఒక మంచి పని చేసేటప్పుడు ఈ సమాజంలో సపోర్ట్ తో పాటు అడ్డు పడే శక్తులు కూడా చాలానే ఉంటాయి. ఇక విమర్శలు కూడా పుట్టుకొస్తూనే ఉంటాయి. సెలబ్రెటీలకు అలాంటి చేదు అనుభవాలు నిత్యం ఎదురయ్యేవే. ఇక లాక్ డౌన్ మొదలైనప్పటికి నుంచి అనేక రకాలుగా పేద జనాలకు సహాయాన్ని అందిస్తున్న రియల్ హీరో సోనూ సూద్ పై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ రావడం ఆశ్చర్యనికి గురి చేస్తోంది. ఆయన అనుకున్నంతగా చేసిందేమీ లేదని కూడా కామెంట్స్ చేస్తుండడం విడ్డురం.
రియల్ హీరోలా కనిపించాడు
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ప్రేక్షకులకు కూడా ఒక వెండితెర విలన్ గా తెలిసిన సోనూ సూద్ లాక్ డౌన్ తరువాత మాత్రం ఒక రియల్ హీరోల కనిపించాడు. కరోనా వైరస్ తో జనాలు పడుతున్న ఇబ్బందులు చూడలేక చాలా మంది ట్వీట్స్ వేశారు గాని సహాయం చేయలేదు. కొందరు మాత్రమే వారికి తోచినంత సహాయం చేయగా మరికొందరు మాత్రం జనాలకు దగ్గరుండి సహాయం చేశారు. అందులో సోనూ సూద్ ఒకరు.
వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టాలని
వలసధారులను సొంత గూటికి చేర్పించడం నుంచి విద్యార్థులకు రైతులకు సహాయం అందించే వరకు సోనూ సూద్ చేసిన సహాయలకు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మద్దతు లభించింది. కానీ మరోవైపు కొన్ని దుష్ట శక్తులు ఆయన వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేటున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఎంతమందికి సహాయం చేసావ్? ఇంకా అనుకున్నంత స్థాయిలో సహాయలు చేయలేదు? అనే ప్రశ్నలు వెలువడ్డాయి.
బయటపడిన అసలు లెక్కలు
అందుకే వారికి దిమ్మ తిరిగేలా సోనూ సూద్ పీఆర్ టీమ్ అసలు లెక్కలను బయటపెట్టింది. ఎవరెవరికి ఎలాంటి సహాయం అందింది అనే విషయాలతో పాటు సహాయం పొందిన వ్యక్తి ఆధార్ వివరాలను కూడా సేకరించినట్లు సోనూ సూద్ టీమ్ అసలు లెక్కలను చూపించింది. 7,03,247 మందికి సహాయలు చేసినట్లు వివరణ ఇవ్వడంతో విమర్శలు చేసే వాళ్లకు దిమ్మతిరిగిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Recommended Video
మొత్తంగా ఎంత ఖర్చు చేశారంటే..
సోనూ సూద్ గత రెండు నెలల క్రితమే సహాయల కోసం మొత్తంగా 10కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా తెలిసింది. ఇక ఇటీవల కాలంలో పేద విద్యార్థుల ఆన్ లైన్ చదువుల కోసం ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ కూడా అందించాడు. అలాగే రైతులకు కూడా సహాయం చేశాడు. దీంతో మొత్తంగా 20కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా టాక్ వస్తోంది. వీలైనంత వరకు తన సహాయాలని ఏ మాత్రం ఆపనని ముఖ్యంగా విమర్శలు వచ్చినా కూడా తన మంచి పనులు ఆగవని సోనూ సూద్ స్వీట్ కౌంటర్ ఇస్తున్నాడు.