పేదప్రజలకు సహాయం చేయడానికి అంత డబ్బులెక్కడివి సోనూ.. అదిరిపోయే కౌంటర్

లాక్ డౌన్ లో నిజమైన హీరోల్లో ఒకరైన సోనూ సూద్ ఒక విధంగా పేద ప్రజలకు దేవుడిగా మారాడు ఆమె చెప్పాలి. చెప్పులు లేకుండా కాళ్ళు అరిగేలా వేల కిలోమీటర్లు నడవడానికి సిద్దమైన ఒక కుటుంబం వంద కిలోమీటర్లు దాటగానే ఒక బస్సు వచ్చి వారిని సొంత ఇంటికి చేర్చింది. ఆ కుటుంబం ఆనందం ఎలా ఉంటుందో ఉహించగలమా? ఆ ఆనందానికి కారణం సోనూ సూద్. అందుకే మాకు ఆయన దేవుడు అని నార్త్ జనాలు అంటున్నారు. అలాంటి సోనూ సూద్ పై కొందరు అనవసరంగా విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

 బ్యాంక్ అకౌంట్స్ లలో డబ్బు..

బ్యాంక్ అకౌంట్స్ లలో డబ్బు..

బస్సులనే కాకుండా ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనది. ఇక ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల అన్నం పెట్టాడు. అదే విధంగా లాక్ డౌన్ లో ఆర్థిక సమస్యలతో మరణించిన కుటుంబాలను సైతం అదుకున్నాడు. లెక్కలేనంత మంది బ్యాంక్ అకౌంట్స్ లలో వారికి అవసరం అయినంత డబ్బు వేశాడు.

 అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా

అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా

ఇన్ని మంచి పనులు చేస్తున్న సోనూ సూద్ పై విమర్శలు రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో కావాలని కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఆ విమర్శలన్నిటిని సోనూ సూద్ ఎక్కువగా పట్టించుకోవడం లేదు. మంచి చేసే సమయంలో ఇలాంటి అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా ఉండాలని సూటిగా ఆన్సర్ ఇస్తున్నాడు.

ఆర్థికంగా బాగానే స్థిరపడ్డాను

ఆర్థికంగా బాగానే స్థిరపడ్డాను

ఇక ఇటీవల సోనూ సూద్ ఆస్తులపై అలాగే అతనికి సహాయం చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్న విషయంలో కొన్ని కామెంట్స్ రాగా సోనూ క్లియర్ గా వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. నేను ఆర్థికంగా బాగానే స్థిరపడ్డాను. మీరు అనుకున్నంత తక్కువ ఏమి లేదు లెండి. కానీ నేను చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల వెనుక నాతో పాటు చాలా మంది ఉన్నారు.

Recommended Video

Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
మంచి వ్యాపారాలు ఉన్నాయి.

మంచి వ్యాపారాలు ఉన్నాయి.

మొదటి నుంచి కూడా నా ఫ్యామిలీకి ఎలాంటి లోటు లేదు. మాకు మంచి వ్యాపారాలు ఉన్నాయి. నేను కూడా సినిమా రంగంలో బాగానే సంపాదించి నాలుగు డబ్బులు వెనకేసుకున్నాను. ఆ తరువాత నాకు వీలైనంత వరకు సహాయం చేయాలని డిసైడ్ అయ్యాను. అప్పుడే కొంతమంది మనసున్న మంచి వారు నాతో చేతులు కలిపారు. నేను ఈ రోజు ఇంతమందికి సహాయం చేస్తున్నాను అంటే అది వారి మంచితనం వల్లే. ఆర్థికంగా, సాకేతికంగా సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.. అని సోనూ సూద్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X