ప్రతి ఒక్కరికి సహాయం చేయడం నా వల్ల కాదు.. క్షమించండి: సోనూ సూద్ షాకింగ్ కామెంట్స్
లాల్ డౌన్ మొదలైన తరువాత కూలీ పని చేసుకునే వలసదారులకు ఒక దైవంలా కనిపించిన సినీ నటుడు సోనూ సూద్. వివిధ రాష్ట్రల నుంచి రోడ్డు బాట పట్టిన ఎంతో మంది ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించి గమ్యాలకు చేర్చాడు. విమానాల్లో కూడా పంపించాడు. అయితే సోనూ సూద్ ఆ తరువాత ఆర్థికంగా కూడా చాలా మందికి చేయూతను అందిస్తున్నాడు. వీలైనంత వరకు తన శక్తి ఉన్నంత వరకు సహాయలు అందిస్తానని కూడా సోనూ ప్రతిసారి వివరణ ఇస్తున్నాడు.

ప్రతి ఒక్కరికీ సహాయం చేయడం అసాధ్యం
1137 మెయిల్స్. 19000 fb సందేశాలు. 4812 ఇన్‌స్టా సందేశాలు. 6741 ట్విట్టర్ సందేశాలు అంటూ ఇలా నెంబర్లను షేర్ చేసిన సోనూ సూద్ ఇవన్నీ ఒక్కరోజులోనే తనకు వచ్చిన సందేశాలని పేర్కొన్నారు. సగటున ఇవి నాకు సహాయం కోసం వచ్చే అభ్యర్థనల సంఖ్య మాత్రేమనని. ప్రతి ఒక్కరికీ సహాయం చేయడం అసాధ్యమని అన్నారు.


Click it and Unblock the Notifications











