మరో మంచి పనితో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్
లాక్ డౌన్ మొదలైన క్రమంలో వలసదారులను ఒక దేవుడిలా అండగా నిలిచిన రియల్ హీరో సోనూ సూద్. ఆర్థికంగా సహాయలు ఎవరైనా చేస్తారు కానీ దాన్ని సరైన పద్దతిలో అమలు పరిచే వాళ్ళు కొందరే ఉంటారు. డబ్బులు ఇవ్వడం కన్నా వీలైనంత వరకు జనాల దగ్గరకు వెళ్లి అవసరమయ్యే విధంగా సహాయం చేయడమే అసలైన మంచి పని అనుకున్న సోనూ వేలాది మందికి బాసటగా నిలిచారు.
లాక్ డౌన్ అనంతరం కూడా సోనూ టెక్నాలజీని ఉపయోగించుకొని అనేక రకాలుగా సహాయలు చేస్తున్నాడు. పేద విద్యార్థులకు చదువు విషయంలో అవసరం ఏదైనా కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇటీవల సోనూ సూద్ మరో మంచి పనితో జనాలను ఆకట్టుకున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలి బాధలను కూడా తీర్చే ప్రయత్నం చేసిన సోనూ ఇప్పుడు అంబులెన్స్ సర్వీస్ లను స్టార్ట్ చేశాడు.
Photos: లావుగా ఉండే సెలబ్రెటీలు..ఇప్పుడు ఎంత నాజూగ్గా మారిపోయారో

అత్యవసర పరిస్థితులలో పేద వారికి అంబులెన్స్ అవసరమయ్యే విదంగా ఈ సర్వీసును ఉచితంగా అందించనున్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో సోనూసూద్ జనాల సమక్షంలో ఈ సర్విస్ ను స్టార్ట్ చేశాడు. ట్యాంక్ బండ్ శివ ఆధ్వర్యంలో సోనూ సూద్ అంబులెన్స్ సర్విస్ కొనసాగనున్నట్లు చెప్పారు. ఇక ఇటీవల సోనూసూద్ అల్లుడు అదుర్స్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే ఒక తలుగు నిర్మాత ఆయనను హీరోగా పెట్టి సినిమా తీయాలని అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











