హాట్ టాపిక్‌గా సోనూ సూద్ ఆస్తుల విలువ.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు ఖర్చు చేశాడంటే?

బాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ ఇలా బాషాభేదం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసిన నటుడు సోనూ సూద్. దాదాపు 20ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం రియల్ హీరోల కంటే హై రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నాడు. లాక్ డౌన్ ముందు వరకు అతను వెండితెరపై కనిపించే విలన్. కానీ ఇప్పుడు మన ముందుకు వచ్చిన రియల్ హీరో. గత కొన్ని రోజులుగా ప్రాంతీయ బేధం లేకుండా సహాయలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే సోనూ సూద్ ఆస్తుల విలువ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

చెప్పకపోయినా కూడా..

చెప్పకపోయినా కూడా..

మనిషి మంచితనం, బలం అనేవి ప్రదర్శించేవి కాదు. సమయం సందర్భం వచ్చినప్పుడే అవి బయటపడతాయి. అదే విధంగా సోనూ సూద్ అసలు గుణం ఏమిటనేది కూడా లాక్ డౌన్ కష్టాల్లోనే బయటపడింది. అంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ సోనూ సూద్ ప్రచారాలు చేసుకోలేదు. కానీ లాక్ డౌన్ లో అతను చెప్పకపోయినా కూడా సోషల్ మీడియా వల్ల వైరల్ అయ్యింది.

 ఈజీగా అతని గురించి తెలిసిపోయింది..

ఈజీగా అతని గురించి తెలిసిపోయింది..

అలాగే సహాయం చేయడానికి వీలుగా సోషల్ మీడియాను కూడా సోనూ సూద్ ఉపయోగిస్తున్నారు. దీంతో జనాలకు ఈజీగా అతని గురించి తెలిసిపోతుంది. లాక్ డౌన్ లో ఎంతో మంది వలస కూలీలను సొంత ఊళ్లకు పంపడానికి సోనూ సూద్ కృషి చేశారు. కాస్ట్లీ వోల్వో బస్సులను ఏర్పాటు చేసి సొంత ఇళ్లకు చేర్చాడు.

ఎందాకైనా వెళతాను అనేలా

ఎందాకైనా వెళతాను అనేలా

అదే విధంగా లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. కొందరు ఆకలి చావులతో మరణించారు కూడా. ఈ విషయంపై కూడా ఆలోచించిన సోనూ సూద్ మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాడు. విదేశాల్లో ఉన్న పేదవారికి కూడా చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా ఇండియాకు రప్పించాడు. సహాయం చేయడానికి ఎందాకైనా వెళతాను అనేలా సోనూ సూద్ వ్యవహరించిన తీరు జనాలను ఎంతగానో ఆకర్షించింది.

అనేక సందేహాలు

అనేక సందేహాలు

ఇక ఆంద్రప్రదేశ్ లో ఒక రైతు వ్యవసాయం కోసం ఎడ్లు లేక కుతుళ్ళను జోడెద్దులుగా మార్చన తీరుకు కలత చెందిన సోనూ వారికి ఏకంగా ట్రాక్టర్ పంపించాడు. అయితే సోనూ సూద్ ఇంతగా సహాయలు చేస్తున్నాడు కదా అతని వెనకున్న ధైర్యం ఏమిటి? ఆస్తులు ఎంతలో ఉన్నాయి? ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశాడు? అతను నెక్స్ట్ స్టెప్ ఏమిటి? అనే సందేహాలు ఎన్నో వస్తున్నాయి.

ఆస్తుల విలువ ఎంత?

ఆస్తుల విలువ ఎంత?

సోనూ సూద్ ఆస్తుల గురించి ప్రస్తుతం ఇంటర్నెట్ లో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే అతని ఆస్తుల విలువ రూ.130కోట్లు ఉంటుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 1999లో సినిమా ఇండస్ట్రీలోకి ఆడుగుపెట్టిన సోనూ సూద్ మెయిన్ గా విలన్ పాత్రలతోనే మంచి క్రేజ్ అందుకున్నాడు.

ఎంత ఖర్చు చేశాడు

ఎంత ఖర్చు చేశాడు

సేవింగ్స్ తో అతను ముంబైలోనే కొన్ని హోటల్స్ ని నిర్మించాడు. ఆ బిజినెస్ తోనే సోనూ తన ఆదాయాన్ని ఎక్కువగా పెంచుకున్నాడు. ఇక ఇప్పటివరకు సోనూ సూద్ ఖర్చు చేసింది 10కోట్లు అని తెలుస్తోంది. ఇక ముందు కూడా మరింత ఖర్చు చేయాలని వీలైనంత వరకు తన సంపాదనలో సగం జనాల కోసం ఖర్చు చేయాలని అనుకుంటున్నట్లు సోనూ సూద్ వివరణ ఇచ్చాడు.

Recommended Video

Music Composer Wajid Khan Of Sajid-Wajid Passes Away Due To COVID-19
పాలిటిక్స్ గురించి ఆ తరువాత

పాలిటిక్స్ గురించి ఆ తరువాత

పాలిటిక్స్ పై ఇప్పట్లో తాను ఏ మాత్రం స్పందించలేను అని చెప్పిన సోనూ సూద్ మరో పదేళ్ల వరకు హిందీలోనే కాకుండా తెలుగులో అలాగే ఇతర భాషల్లో మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఇక పాలిటిక్స్ గురించి మరో పదేళ్ల తరువాత ఆలోచిస్తాను అని క్లారిటి ఇవ్వడంతో అనేక రకాల సందేహాలకు క్లారీటి ఇచ్చినట్లయ్యింది. మరి సోనూ సూద్ భవిష్యత్తులో ఇంకెలాంటి మంచి కార్యక్రమాలు చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X