Sonu Sood: భార్య రక్తం తాగుతోంది కాపాడండి మహాప్రభో అంటూ ట్వీట్.. సోనూ ఏమన్నాడంటే?

రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో బిజీగా మారారు. సినిమాల్లో బిజీగా ఉన్నా సరే తాను ప్రారంభించిన సేవా కార్యక్రమాలు ఏమాత్రం తగ్గకుండా చేస్తూనే ఉన్నారు. ఒకపక్క సేవా కార్యక్రమాల్లో మరోపక్క సినిమా షూటింగులలో బిజీగా ఉన్నా సరే ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా నే ఉంటున్నారు. తాజాగా ఒక నెటిజన్ అడిగిన వింత కోరికకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

తనదైన స్టైల్‌లో

తనదైన స్టైల్‌లో

సోనూ సూద్ తన దాతృత్వానికి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో చాలా మందికి సహాయం చేశారు. ఈ రోజుకు కూడా, ప్రజలు సోషల్ మీడియాలో ఆయన సహాయం కోరినప్పుడు, సోనూ సూద్ వాటిని ఎప్పుడూ తిరస్కరించలేదు. అయితే చాలా సార్లు ఆయనకు వింత రిక్వెస్ట్‌లు వస్తుంటాయి, వాటికి కూడా సోనూ తనదైన స్టైల్‌లో సమాధానమిస్తాడు. తాజాగా ఇలాంటి ఘటనే తెరపైకి వచ్చింది.

నెటిజన్ వింత కోరిక

నెటిజన్ వింత కోరిక


ఒకరు సోషల్ మీడియాలో ఒక బాలిక ఫోటో షేర్ చేసి సోనూసూద్ ఫౌండేషన్ కారణంగా ఈ బాలిక ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని సోను సూద్ కి ధన్యవాదాలు తెలిపారు. దానికి సోనూసూద్ చాలా హుందాగా స్పందిస్తూ ఇది నా బాధ్యత దీనికి ధన్యవాదాలు ఎందుకు అంటూ రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ కొద్దిసేపట్లోనే వైరల్ అయింది. మరి సరదాగా అడిగాడో ఎందుకు అడిగాడు తెలియదు గానీ ఒక నెటిజన్ వింత కోరిక సోనూసూద్ ముందుకు తీసుకువచ్చాడు.

సహాయం కోసం అడుగుతున్నాడు

సహాయం కోసం అడుగుతున్నాడు


సోనూసూద్ బ్రదర్, మీరందరి చికిత్సలు చేయిస్తూ ఉంటారు కదా. నా భార్య నా రక్తం ఎక్కువగా తాగుతుంది కాబట్టి ఆమెకు ఏమైనా చికిత్స ఉందా? ఒకవేళ అలాంటి చికిత్స కనుక ఉంది అంటే వీలైనంత త్వరగా ఆమె జబ్బుకు చికిత్స అందించే ప్రయత్నం చేయండి. ఆమెతో బాధలు పడుతూ సంతోషంగా లేని ఒక భర్త చేతులు జోడించి మిమ్మల్ని సహాయం కోసం అడుగుతున్నాడు అంటూ ట్వీట్ చేశాడు.

 MTV రోడీస్‌ టీవీ షోకి

MTV రోడీస్‌ టీవీ షోకి


దానికి సోనూ సూద్ స్పందిస్తూ సోదరా భర్త రక్తం తాగడం ప్రతి భార్య జన్మహక్కు.. ఒకవేళ మీ రక్తం ఎక్కువ తాగుతుంది అని మీకు అనిపిస్తే మీరు కూడా నాలాగే అదే రక్తంతో బ్లడ్ బ్యాంక్ తెరవండి అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సోను MTV రోడీస్‌ టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షో యొక్క కొత్త సీజన్‌ని ఆయన ఇటీవల హోస్ట్ చేయడం ప్రారంభించాడు. ఆయన ఈ షోలో రణ్‌విజయ్ సింగ్ స్థానంలో ఎంట్రీ ఇచ్చాడు. గత 18 సంవత్సరాలుగా రణ్‌విజయ్ ఈ షోతో అసోసియేట్‌ అయి ఉన్నారు.

జూన్ 3న

జూన్ 3న


ఈ కొత్త ప్రారంభం గురించి సోనూ మాట్లాడుతూ, ఈ షోతో అసోసియేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే సోనూ సూద్ త్వరలో డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది పృథ్వీరాజ్ చిత్రంలో కనిపించనున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా పృథ్వీరాజ్ భారతీయ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. మానుషి చిల్లర్‌కి ఇదే తొలి సినిమా కాగా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని జూన్ 3న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X