కరోనా ఎఫెక్ట్ : రీల్ విలన్ రియల్ హీరో.. అత్యంత ఖరీదైన హోటల్‌ను..!!
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా నిలబడలేకపోతోంది. అక్కడ లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వేల సంఖ్యలో ప్రాణాలను కోల్పోతున్నారు. మన దేశంలోనూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆరు వేల మందికిపైగా కరోనా సోకింది. వందల మంది మరణించారు. ఇంతలా విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

లాక్ డౌన్‌లో పెరిగిన కేసులు..
లాక్‌డౌన్ విధించినా కరోనాను పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతోన్నారు. రోజు రోజుకూ పరిస్థితి దిగజారి పోతోంది. 21రోజుల పాటు లాక్ డౌన్ విధించినా.. అదుపు చేయలేకపోతోండటం మరి కొన్ని రోజుల పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మన దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

అత్యధికంగా మహారాష్ట్రలోనే..
భారతదేశ కరోనా కేసుల్లో మహారాష్ట్రదే అత్యధిక భాగం. అక్కడే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలనే తీసుకుంటోంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి అండగా సినీ తారలంతా ముందుకు వస్తున్నారు.

కార్యాలయాలను క్వారంటైన్ కేంద్రాలుగా..
కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి ఆర్థిక అండను ఇస్తున్నారు. అంతేకాకుండా క్వారంటైన్ కేంద్రాలుగా వాడుకునేందుక వారి కార్యాలయాలను కూడా ఇచ్చేస్తున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. తన కార్యాలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా వాడుకోవచ్చని ప్రభుత్వానికి సూచించాడు.
Recommended Video

తాజాగా సోనూ సూద్ సైతం..
కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్యులకు, నర్సులకు, వైద్య బృందాలకు తన హోటల్‌ను వాడుకోవడాని ఇచ్చేస్తున్నట్టు తెలిపాడు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారని, వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని.. తన హోటల్ ఇలా ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉందని సోనూ సూద్ తెలిపాడు. ఈ నిర్ణయం పట్ల సోనూసూద్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిస్తున్నారు.


Click it and Unblock the Notifications











