వీడియో గేమ్ కావాలన్న విద్యార్ధి.. దిమ్మతిరిగే జవాబిచ్చిన సోనూ సూద్.. ఎందుకంటే!

ప్రస్తుతం దేశమంతా సోనూ సూద్ పేరు ఏ స్థాయిలో వినిపిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ నుంచి కూడా సోనూ సూద్ ఎవరు ఊహించని విదంగా ఎంతో మందికి సహాయం చేశాడు. వలసధారులను ఇంటికి పంపడానికి ప్రత్యేకంగా వోల్వో బస్సులను ఏర్పాటు చేశాడు. అనంతరం రైతులకు, పేదలకు ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తున్నాడు.

Recommended Video

Sonu Sood's Response To Teen Asking For PS4 Is A Hit On Twitter
వీడియో గేమ్ కావాలన్న విద్యార్థి

వీడియో గేమ్ కావాలన్న విద్యార్థి

ఇటీవల సోషల్ మీడియా ద్వారానే ఒక వృద్ధురాలికి ఆర్థిక సహాయం అందించిన సోనూ సూద్ అనంతరం ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక రైతుకు ట్రాక్టర్ కూడా కొనిచ్చాడు. అయితే ఇటీవల ఒక కుర్రాడి విన్నపం మాత్రం అందరిని షాక్ కి గురి చేసింది. ఆ స్టూడెంట్ దాదాపు రూ.30వేల విలువగల వీడియో గేమ్ కావాలని కోరాడు. అందుకు తగ్గట్టుగానే సోనూ సూద్ కూడా అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

నాకు సహాయం చేయండి అంటూ..

నాకు సహాయం చేయండి అంటూ..

ఇంతకు నిలేశ్ అనే ఆ స్టూడెంట్ ఏమన్నాడు అంటే.. ప్లీజ్ సోనూ సూద్ సర్.. నాకు PS4 ఇచ్చి సహాయం చేయగలరా. నా చుట్టూ ఉన్న పిల్లలు చాలా మంది లాక్ డౌన్ నుంచి గేమ్స్ ఆడుకుంటూ చాలా సరదాగా ఉన్నారు. ఈ విషయంలో నాకు మీరు సహాయం చేయండి ప్లీజ్ సర్ అని ఆ కుర్రాడు ట్వీట్ చేశాడు.

అదిరిపోయే సమాధానం ఇచ్చిన సోనూ

అదిరిపోయే సమాధానం ఇచ్చిన సోనూ

అందుకు సోనూ సూద్ కూడా ఆ కుర్రాడికి అర్థమయ్యేలా ట్వీట్ చేశాడు. నిజంగా PS4 నీ దగ్గర లేకపోవడమే మంచిది. అది ఒక ఆశీర్వాదం లాంటిది. కొన్ని పొస్తకాలు చదివితే మంచిది. ఆ విషయంలో నేను మీకు సహాయం చేయగలను అంటూ సోనూ సూద్ కూల్ గా అదిరిపోయే సమాధానం ఇచ్చారు.

 మళ్ళీ ఆన్సర్ ఇచ్చిన స్టూడెంట్

మళ్ళీ ఆన్సర్ ఇచ్చిన స్టూడెంట్

అనంతరం మళ్ళీ ఆ స్టూడెంట్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. 'అవును సర్ నేను తప్పకుండా పరిజ్ఞానం గల పుస్తకాలను చదువుతానని మీకు హామీ ఇస్తున్నాను, మీ నుండి మరింత విలువైన, సహాయకరమైన పుస్తకాలను స్వీకరిస్తానని ఆశిస్తున్నాను. సర్ మీరు చేస్తున్న పని చాలా బాగుంది ....నన్ను భారతీయులందరినీ ఇలానే ప్రేరేపించండి. లవ్ యు సార్' అని నిలేశ్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X