రియల్ హీరో : వలస కూలీలకు అన్నదానం.. సాయం చేయండని సోనూ సూద్ పిలుపు
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం గజగజవణికిపోతోంది. ఈ వైరస్ తాకిడికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 19 లక్షల మంది కరోనా బారిన పడగా.. లక్షకు పైగా దుర్మరణం చెందారు. మన దేశంలోనూ కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించగా.. మరోసారి పొడిగించారు.

మే 3 వరకు లాక్ డౌన్..
లాక్‌డౌన్ విధించినా కరోనాను పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతోన్నారు. రోజు రోజుకూ పరిస్థితి దిగజారి పోతోంది. 21రోజుల పాటు లాక్ డౌన్ విధించినా.. అదుపు చేయలేకపోతోండటం మరి కొన్ని రోజుల పొడిగించారు. మరో 19 రోజులు అనగా మే 3 వరకు లాక్ డౌన్‌ను పొడిగించినట్టు ప్రధాని ప్రకటించారు.

ముందుకు వస్తున్న తారలు..
భారతదేశ కరోనా కేసుల్లో మహారాష్ట్రదే అత్యధిక భాగం. అక్కడే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దాదాపు రెండువేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వానికి సినీ తారలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. వారిలో ప్రముఖ నటుడు, విలన్ సోనూ సూద్ ముందున్నాడు.

వైద్య బృందానికి బస..
కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్యులకు, నర్సులకు, వైద్య బృందాలకు తన హోటల్‌ను వాడుకోవడాని ఇచ్చేస్తున్నట్టు తెలిపాడు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారని, వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని.. తన హోటల్ ఇలా ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉందని సోనూ సూద్ తెలిపాడు. ఈ నిర్ణయం పట్ల సోనూసూద్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిస్తున్నారు.

తాజాగా అన్నదానం..
దినసరి కూలీలు, వలస కార్మికులకు ఆహారం దొరకడం లేదని తెలుసుకున్న సోనూ సూద్ ట్రక్ ద్వారా ఆహారాన్ని అందించాడు. తన తండ్రి పేరు మీదుగా శక్తి అన్నదానం అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటికీ 45 వేల మందికి అన్నం పెట్టినట్టు తెలిపాడు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి, చేతనైనా సాయాన్ని చేయండని పిలుపునిచ్చాడు.


Click it and Unblock the Notifications











