Fateh Teaser Review 40 కాదు 50 మందిని వేసేశా.. RIP అంటూ డైరెక్టర్‌గా సోనుసూద్ టీజర్‌తోనే అదుర్స్!
తెలుగు ప్రేక్షకులకు సోనుసూద్ అంటే విలన్‌గానే గుర్తుకు వస్తాడు. కానీ కరోనా లాక్‌డౌన్ సమయంలో చేసిన సేవలతో ఆయన మానవతామూర్తిగా అవతారం ఎత్తాడు. దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్యదైవంగా నిలిచాడు. తనకు లభించిన ఇమేజ్‌తో ప్రస్తుతం నటుడిగా, దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.
స్వీయ దర్శకత్వంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫతే. ఈ మూవీకి సొనాలీ సూద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్ గురించిన రివ్యూ వివరాల్లోకి వెళితే..

ఫతే సినిమా విషయానికి వస్తే.. స్వయంగా దర్శకత్వం వహిస్తూ సోనుసూద్ నటించిన ఈ చిత్రంలో జ్వాక్వలైన్ ఫెర్నాండేజ్, శివజ్యోతి రాజ్‌పుత్ తదితరులు నటిస్తున్నారు. కళ్లు చెదిరిలా, గుండెలు అదిరేలా యాక్షన్ సీన్లతో ఉండే ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటాకర్ పనిచేశాడు. స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను ఇండియా, రష్యా, అమెరికా, పొలెండ్‌లో షూట్ చేశారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విషయానికి వస్తే.. తక్కువగా అంచనా వేయకు అనే ట్యాగ్ లైన్‌తో ఓ బుల్లెట్ కింద పడుతుండగా టీజర్ మొదలవుతుంది. ఫతే అనేది సోను సూద్ పేరుగా స్పష్టమైంది. మార్చి 19వ తేదీన నువ్వ 40 మందిని చంపేశావు అని ఓ వ్యక్తి గొంతు వినిపించగానే.. 40 కాదు.. 50 మంది. అందులో 10 మంది శవాలు మీకు ఎప్పటికీ దొరకవు అంటూ సోను సూద్ కంఠంలో నుంచి మాటలు కర్కశంగా వినిపించడం టీజర్‌పై ఆసక్తిని రేపింది.

అయితే సోనూ సూద్ మాటలకు స్పందించిన ఆ వ్యక్తి.. 50 మందిని చంపావుగా.. ఏమైనా చెప్పాలని అనుకొంటున్నావా? అని అడిగితే.. వారందరికి భగంతుడు శాంతి కలిగించాలని ప్రార్థిస్తాను అని సమాధానం ఇచ్చాడు. దాంతో నీవు చేసిన పని.. సరైనదే అని నీవు సమర్ధించుకొంటావా? అని ప్రశ్నించగానే.. సోను సూద్ తన చేతిలో రెండు పిస్టల్స్ తీసుకొని నడుచుకొంటూ.. ఎవడైతే పుట్టాడో వాడు చావడం తథ్యం. అదే సృష్టి రహస్యం అంటూ ఆయన నడుచుకుంటూ రావడం ఆ సీన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది.
టీజర్‌లో సోను సూద్‌తో అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. ఆ రోజు నీవు ఓ యువతితో ఉన్నావా? అంటే లేదు.. ఆమెనే నాతో ఉంది అంటూ జవాబు చెప్పాడు. ఇక చివర్లో టీజర్‌లో చూపించిన యాక్షన్ సీన్లు, ఫైట్స్, ఛేజింగ్ సీన్లు కేక పెట్టించాయి. 2024లో ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. మీరు సిద్దంగా ఉండండి అంటూ క్రేజీ న్యూస్ అందించారు.


Click it and Unblock the Notifications











