ప్రాణం ఉన్నంత వరకు ఇలా చేస్తూనే ఉంటా.. దయచేసి నన్ను అలా పోల్చకండి: సోనూ సూద్

లాక్ డౌన్ మొదలైనప్పుడు అందరి మదిలో స్థానం సంపాదించుకున్న ఏకైక నటుడు సోనూ సూద్. వెండితెరపై విలన్ గా ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లోనే కాకవుండా టాలీవుడ్ లో కూడా ఎక్కువగా విలన్ పాత్రలతోనే క్రేజ్ అందుకున్నాడు. ఇక ఈ 8నెలల కాలంలోనే అతనికున్న క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. జనాలు ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేశారు. ఇక రియాలిటీ షోలతో కూడా అప్పుడప్పుడు సెలబ్రెటీలు ఆయన్ని పొగుడుతున్నారు. ఇటీవల ఈటీవీలోని ఒక షోలో కూడా సోనూపై ప్రశంసలు కురిపించారు.

Recommended Video

Sonu Sood Snapped As He Steps Out With His Family For Ganpati Visarjan
తెలుగు షోలో సోనూ సూద్

తెలుగు షోలో సోనూ సూద్

దీపావళి ఫెస్టివల్ లో భాగంగా ఈటీవీలో ప్రసరమైన శ్రీ కనకమహాలక్షి లక్కీ డ్రా షోలో సోనూ సూద్ సహాయాల గురించి ఎంతగానో కొనియాడారు శేఖర్ మాస్టర్, రోజా. సోనూ సూద్ ద్వారా సహాయం పొందిన చాలా మంది ఆయన గురించి గొప్పగా చెప్పారు. ఇక సోనూ సూద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు.

రోజా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ

రోజా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ

మీరు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. చేస్తూనే ఉన్నారు. అందుకు స్ఫూర్తి ఎవరని రోజా అడుగగా సోనూ సూద్ ఈ విధంగా వివరించాడు. నేను ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి అసలు కారణం మా అమ్మా నాన్నలు. మా అమ్మ ఒక ప్రొఫెసర్. ఎన్నో గ్రామాల్లోని పేద ప్రజలకు ఆర్థికంగా సహాయం అందించారు. పిల్లలకు చదువుకోవడానికి కూడా సహాయం చేశారని చెప్పాడు.

నిజమైన సక్సెస్ అంటే

నిజమైన సక్సెస్ అంటే

అంతే కాకుండా మా అమ్మ ప్రతి సారి నాకు ఒక విషయం చెబుతుండేవారు. నిజమైన సక్సెస్ అంటే ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు అడగకముందే సహాయం చేయడమే నిజమైన విజయంతో సమానం అని చెప్పారు. అదే నేను ఇప్పుడు చేస్తున్నాను. నాకు ఆ విధంగా వాళ్ళు స్ఫూర్తినిచ్చారు. వాళ్ళు ఇప్పుడు లేకపోయినా పై నుంచి నేను చేసే మంచి పనులకు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారని అనుకుంటున్నట్లు సోనూ వివరణ ఇచ్చారు.

దయచేసి నన్ను అలా పోల్చకండి..

దయచేసి నన్ను అలా పోల్చకండి..

రోడ్డు పక్కన ఎవరికైనా పది రూపాయలు సహాయం చేస్తే దేవుడితో పోలుస్తారు. ఇక మీరు అంతకుమించి సహాయలు ఎన్నో చేశారు. మరి మిమ్మల్ని ఏమనాలి అంటూ శేఖర్ మాస్టర్ అడుగగా అందుకు సోనూ సూద్ స్పందిస్తూ.. మీ ప్రేమకు ధన్యవాదాలు కానీ దయచేసి నన్ను దేవుడితో పోల్చకండని చెప్పాడు.

ప్రాణం ఉన్నంత వరకు అలా చేస్తూనే ఉంటాను

ప్రాణం ఉన్నంత వరకు అలా చేస్తూనే ఉంటాను

నేను కూడా ఒక సాధారణమైన వ్యక్తిని కాకపోతే కష్టాల్లో ఎవరైనా ఉంటే నా మనసుకు బాధగా ఉంటుందని అన్నాడు. వలసకార్మికులు, పేదవారికి చదువులు, ఆపరేషన్స్ ఇలా నా వంతు సహాయం నేను చేశాను. నా ప్రాణం ఉన్నంత వరకు అలా చేస్తూనే ఉంటానని సోనూ సూద్ తెలిపారు. ఇక కొన్నిరోజుల క్రితం ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో సోనూ సూద్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పట్లో తనకు అలాంటి ఆలోచన ఏమి లేదని ప్రస్తుతం తన దృష్టి పేద వాళ్లకు వీలైనంత వరకు సహాయం చేయాలని ఉందని అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X