రజనీకాంత్ కంటే డిఫరెంట్ గా సోనూసూద్.. పొలిటికల్ ఆఫర్స్ వస్తున్నాయి కానీ..?
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల పొలిటికల్ పార్టీ ప్రకటిస్తానని సంచలన స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ వెంటనే యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా రాడా అనే సందేహానికి ఆల్ మోస్ట్ ఎండ్ కార్డ్ పడింది. ఆరోగ్య పరిస్థితులు వల్ల పాలిటిక్స్ అనేవి కుదరని పని ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక లాక్ డౌన్ నుంచి కూడా సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే సందేహం కూడా అభిమానుల్లో పెద్ద కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది.

దానాలు ధర్మాలు ఎవరైనా చేస్తారు..
లాక్ డౌన్ మొదలైన క్రమంలో వలసదారులను ఒక దేవుడిలా ఆదుకున్న రియల్ హీరో సోనూ సూద్. దానాలు ధర్మాలు ఎవరైనా చేస్తారు కానీ దాన్ని సరైన పద్దతిలో అమలు పరిచే వాళ్ళు కొందరే ఉంటారు. ఫండ్స్ ఇవ్వడం కన్నా వీలైనంత వరకు జనాల దగ్గరకు వెళ్లి సహాయం చేయడమే అసలైన మంచి పని అనుకున్న సోనూ వేలాది మందికి బాసటగా నిలిచారు.

కేవలం ఆ పనులే కాకుండా..
కేవలం వలసదారులను ఇంటికి చేర్చడమే కాకుండా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలి బాధలను కూడా తీర్చే ప్రయత్నం చేశాడు. పైగా ఎప్పటికప్పుడు వాళ్ళ కష్ట సుఖాల గురించి తెలుసుకొని అండగా నిలిచారు. చదువు కోసం ఎంతో మంది పేద విద్యార్థులకు కూడా సహాయం అందించిన సోనూ సూద్ అనేక రకాల ఆర్థిక సహాయలను కూడా చేశాడు. రైతులకు కూడా సహాయం చేసే ప్రయత్నం చేశారు.

సోనూ ఖర్చు చేసింది ఎంత..
లాక్ డౌన్ లోనే సోనూ సూద్ 7 నుంచి 8కోట్ల వరకు ప్రజా సేవ కోసమే ఖర్చు చేసినట్లుగా అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికి ఆ సంఖ్య అంతకంటే ఎక్కువ అయ్యింటుందని చెప్పవచ్చు. ఎందుకంటే సోనూ సూద్ ఆన్ లైన్ ద్వారా చేస్తున్న సహాయలు కూడా చాలానే ఉన్నాయి. ట్విట్టర్ ద్వారా కూడా స్పందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వస్తారా?
ఇక సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తాడని గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. గతంలో ఒకసారి సోనూ సూద్ కూడా భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు కానీ ఇప్పట్లో అయితే రాజకీయాల్లోకి రాలేను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే రూమర్స్ వస్తున్నాయి.

ప్రస్తుతానికైతే..
ఇక ఇటీవల రజినీకాంత్ రాజకోయలపై సందిగ్ధంలో ఉండడంతో సోనూ సూద్ టాపిక్ కూడా వైరల్ అయ్యింది. అయితే మరోసారి సోనూ సూద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం నటుడిగా నాకు మంచి కెరీర్ ఉంది. దాన్ని ఆస్వాదిస్తున్నాను. నాకు నచ్చిన విధంగా తోటి వారికి సహాయం చేస్తున్నానని చెప్పాడు.

రజినీకాంత్ కంటే కాస్త డిఫరెంట్ గా..
ఇక సోనూ సూద్ చేస్తున్న మంచి పనులు వల్ల వస్తున్న క్రేజ్ ను చూసి పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఆఫర్స్ ఇస్తున్నాయట. ఆ విషయంపై కూడా ఈ వెండితెర విలన్ స్పందించాడు. ఆఫర్స్ చాలానే వస్తున్నాయి కానీ నేను వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు వివరణ ఇచ్చారు సోనూ సూద్. మరికొన్నాళ్లు నటుడిగా కొనసాగాలని ఉందని చెబుతూ.. రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే విషయంలో రజినీకాంత్ కంటే కాస్త డిఫరెంట్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











