సోనూసూద్ కోసం ప్రముఖ నిర్మాత ఆరాటం.. పవర్ఫుల్ హీరోగా చూపించాలని..
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ లాక్ డౌన్ తరువాత ఒక పాన్ ఇండియా హీరో కంటే హై రేంజ్ లో గుర్తింపును అందుకున్నాడు. కష్టాల్లో ఉన్న జనాలకు వీలైనంత వరకు సహాయం చేయాలని టార్గెట్ పెట్టుకున్న సోనూ అంటే ఇప్పుడు జనాల మనసులో ఒక రియల్ హీరో. ఇన్ని రోజులు వెండితెరపై విలన్ గా కనిపించిన సోనూ రానున్న సినిమాల్లో మళ్ళీ విలన్ గా కనిపిస్తే జనాలు ఎంతవరకు తట్టుకుంటారో చూడాలి.
ఇక సోనూ సూద్ పాజిటివ్ పాత్రల్లో కనిపించింది చాలా తక్కువ. ఇక నెక్స్ట్ హీరోగా కూడా అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ నిర్మాత గత రెండు నెలలుగా సోనూ సూద్ తో ఎలాగైనా ఒక సినిమాను స్టార్ట్ చేయాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడట. ఒక రైటర్ కథను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సోనూ సూద్ ఆ నిర్మాతతో మరొక సారి సిట్టింగ్ వేయనున్నాడట.

చేతిలో ఉన్న కొన్ని ప్రాజెక్టులు అయిపోగానే ఈ ఏడాది ఏండింగ్ లో సోనూ సూద్ ఆ కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఇటీవల సోనూసూద్‌కు ఐరాస అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నుంచి 'ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డు' లభించిన విషయం తెలిసిందే. యాంజెలినా జోలీ, డేవిడ్ బెక్‌హామ్, లియోనార్డో డి కాప్రియో, ప్రియాంకా చోప్రా తదితర సినీ ప్రముఖులు కూడా గతంలో ఈ అవార్డును అందుకున్నారు.


Click it and Unblock the Notifications











