twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా వల్ల ఆమె ప్రెగ్నెంట్ కాలేదు.. సుశాంత్‌ సూసైడ్‌పై సూరజ్ వివాదాస్పద కామెంట్లు

    |

    యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అలాగే ఆయన మాజీ మేనేజర్ దిశా సలియాన్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరో హీరో సూరజ్ పంచోలి అనూహ్యంగా తెరపైకి రావడం బాలీవుడ్ మీడియాలో సంచలనం రేపింది. గతంలో యువ తార జియా ఖాన్ సూసైడ్ వెనుక సూరజ్ పంచోలి హస్తం ఉంది. సల్మాన్ ఖాన్ అండతో బయటపడ్డారనే ఆరోపణలు మరోసారి సుశాంత్ మరణం తర్వాత ఊపందుకొన్నాయి.

    Recommended Video

    Sushant Singh Rajput : Sushant సూసైడ్‌ కి కారణం నేను కాదు - Sooraj Pancholi || Oneindia Telugu

    ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తూ.. ఆయన మేనేజర్ దిశా సలియాని మరణానికి కారణం సూరజ్ పంచోలి అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో సూరజ్ వ్యవహారం మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది. ఇక ఆవివరాలపై సూరజ్ పంచోలి ఆంగ్ల దిన పత్రికతో మాట్లాడుతూ..

    జియా ఖాన్ సూసైడ్ కేసులో

    జియా ఖాన్ సూసైడ్ కేసులో

    యువ తార జియా ఖాన్ మరణం తర్వాత నాపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే వాటన్నింటిని కోర్టులో ఎదుర్కొన్నాను. ఏ ఒక్క రోజు కూడా కోర్టు విచారణకు గైర్హాజరు కాలేదు. అయితే జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ నాపై వచ్చిన ఆరోపణలను కోర్టులో నిరూపించలేకపోయింది. ఆ కేసులో సీబీఐ విచారణకు ఎదుర్కోవడానికి కూడా రెడీ అయ్యాను. పోలీసులకు పూర్తిగా సహకరించాను. న్యాయం చేయాలనే పేరుతో నన్ను వేధించారు అని సూరజ్ పంచోలి అన్నారు.

     బాలీవుడ్ నెపోటిజంపై

    బాలీవుడ్ నెపోటిజంపై

    ఇండస్ట్రీలో నాకు ఎలాంటి ఫ్యామిలీ నుంచి నాకు సపోర్ట్ లభించలేదు. నేను సినిమా పరిశ్రమకు చెందిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అలాంటి ఫేవర్లను ఉపయోగించుకోలేదు. టీనేజ్ నుంచే గుజారిష్, ఏక్ థా టైగర్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ సమయంలో సల్మాన్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. కాయ్ పో చే సినిమా ఆడిషన్‌ వెళ్తే రిజెక్ట్ అయ్యాను. నేను సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాను అని సూరజ్ పంచోలి తెలిపారు.

     దిశా సలియాని ప్రెగ్నెన్సీపై

    దిశా సలియాని ప్రెగ్నెన్సీపై

    సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియాని తో నాకు రిలేషన్‌షిప్ ఉందని, ఆమె నా వల్ల గర్బం దాల్చినట్టు వెబ్ మీడియాలో వార్తలు రావడం నాకు, నా కుటుంబాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. దిశా సలియానితో నాకు ఎలాంటి అఫైర్ లేదు. నాకు సుశాంత్‌తో ఎలాంటి గొడవలు చోటుచేసుకోలేదు అని సూరజ్ పేర్కొన్నారు. ఇక 2017లో నాతో గొడవలు జరిగాయనే విషయంలో వాస్తవం లేదు అని అన్నారు.

    సల్మాన్ ఖాన్ నాపై ఆగ్రహం

    సల్మాన్ ఖాన్ నాపై ఆగ్రహం

    గత రెండు రోజులుగా మీడియాలో నాపై వస్తున్న వార్తలపై సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశా, సుశాంత్ మరణాలతో లింకు చేస్తూ వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరారు. లేకపోతే అనేక సమస్యలు వస్తాయనే హెచ్చరించడంతో అసలు విషయాలు చెప్పడానికి ముందుకొచ్చాను. నాపై వస్తున్న వార్తలు, ఆరోపణలపై క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకొన్నాను అని సూరజ్ చెప్పారు.

    సుశాంత్‌తో గొడవలు కాలేదు

    సుశాంత్‌తో గొడవలు కాలేదు

    సుశాంత్‌తో నాకు మంచి పరిచయం ఉంది. కానీ మేము క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. ఓ ఫ్రెండ్ ఇంట్లో డిన్నర్ కలిశాం. అప్పటి నుంచి మా మధ్య ఫోన్ కాల్స్, కలుసుకోవడాలు ఉన్నాయి. సుశాంత్ తన సినిమా స్క్రీనింగ్స్‌కు పిలిస్తే వెళ్లడం జరిగింది. అంతేగానీ ఆయనతో నాకు ఎలాంటి గొడవలు లేవు. అలాంటివన్నీ రూమర్లే. గత మూడేళ్లలో నాలుగైదు సార్లు మాత్రమే కలుసుకొన్నాను. ఆయన సూసైడ్‌ కారణాలు ఏమిటో తెలియదు. ఆ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు అని సూరజ్ పంచోలి చెప్పారు.

    దిశా సలియాని ఎవరో తెలియదు

    దిశా సలియాని ఎవరో తెలియదు

    ఇక సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాని గురించి నాకు తెలియదు. ఆమెను ఎప్పుడూ కలవలేదు. సుశాంత్ మరణం తర్వాతే నాకు ఆమె గురించి తెలిసింది. వారి కుటుంబాల్లో చోటుచేసుకొన్న విషాదం నాకు బాధను కలిగించింది. నా వల్ల దిశా సలియాని ప్రెగ్నెంట్ అయిందనే వార్తలన్నీ కట్టు కథలు మాత్రమే. దిశా విషయంలో సుశాంత్ నాతో గొడవ పడలేదు. నాతో మాట్లాడలేదు. ఇలాంటి కల్పిత కథనాలు నా కుటుంబానికి షాక్ కలిగించాయి అని సూరజ్ పంచోలి తెలిపారు.

    English summary
    Bollywood hero Sooraj Pancholi has reacted on Sushant Singh Rajput Suicide, Jiah Khan and Disha Salian death. He said all the stories coming in media are fabricated. I never met disha Salian ever in my life
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X