twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. తెరమీదకు దాదా బయోపిక్.. హీరో ఎవరంటే?

    |

    ప్రస్తుతం అన్ని బాషలలో రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. అలాగే వివిధ రంగాల్లో ఫేమస్ అయిన వారి బయోపిక్స్ తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా ఫాన్స్ అందరూ ఎదురు చూస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

    భారీ బడ్జెట్ తో

    భారీ బడ్జెట్ తో

    ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, మహమ్మద్ అజారుద్దీన్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు కపిల్ దేవ్ బయోపిక్ 83 తెరకెక్కుతోంది. ఇక తాజాగా చివరికి దాదా కూడా తన బయోపిక్ చేయడానికి అంగీకరించారు. సౌరవ్ గంగూలీ తన బయోపిక్ షూట్ చేయడానికి 'అనుమతి' ఇప్పారు. ఈ బయోపిక్ పెద్ద బ్యానర్ ప్రొడక్షన్ హౌస్ చేయనుండగా 200 నుంచి 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఫైనల్లీ

    ఫైనల్లీ

    ఇక తాజాగా ఆయన ఒక వెబ్ సైట్ తో మాట్లాడుతూ "అవును, నేను బయోపిక్‌కు అంగీకరించాను. ఇది హిందీలో ఉంటుంది కానీ ఇప్పుడు దర్శకుడి పేరు చెప్పడం సాధ్యం కాదు. అన్నీ సెట్ చేయడానికి మరికొన్ని రోజులు పడుతుంది "అని గంగూలీ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం స్క్రిప్ట్ రాస్తున్నట్లు చెబుతున్నారు. ప్రొడక్షన్ హౌస్ సౌరవ్ గంగూలీతో పలు సమావేశాలు జరిపింది. కానీ గంగూలీ పాత్రను ఎవరు పోషిస్తారు? అనే విషయం మీద క్లారిటీ లేదని చెబుతున్నారు.

    ఆయనే చాయిస్ అయినా

    ఆయనే చాయిస్ అయినా

    ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ లో దాదాపు ఖరారు అయినట్టేనని అంటున్నారు. రణబీర్ కపూర్ దాదా పాత్ర పోషించడానికి 'హాట్ ఛాయిస్' అని తెలుస్తోంది. గంగూలీ స్వయంగా రణబీర్ పేరును ప్రస్తావించారు, కానీ జాబితాలో మరో ఇద్దరు నటులు కూడా ఉన్నారని అంటున్నారు. సౌరవ్ గంగూలీ యొక్క మొత్తం ప్రయాణం - అంటే బాల్యం నుంచి బిసిసిఐ అధ్యక్షుడయ్యే వరకు - బయోపిక్ లో చూపించే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

    ఇప్పటికే

    ఇప్పటికే

    ఇప్పటికే ఎంఎస్ ధోని బయోపిక్ సూపర్ హిట్ కాగా, భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ బయోపిక్ అజార్ కూడా బాగా ఆడింది. సచిన్ టెండూల్కర్ బయోపిక్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక భారతదేశం యొక్క 1983 ప్రపంచకప్ విజయం గురించి ఒక సినిమా తయారవుతోంది, ఈ సినిమలో రణవీర్ సింగ్ భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నారు. ఇవి కాక భారత మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, జులాన్ గోస్వామి బయోపిక్స్‌ గురించి కూడా పనులు జరుగుతున్నాయి.

    Recommended Video

    'Aha' Team Makes Us Happy To Release Johar Movie In OTT Platform
    ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కూడా

    ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కూడా

    గంగూలీ బయోపిక్ యొక్క వార్తలు వివిధ మాధ్యమాలలో ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాయి. అయితే, ఇటువంటి నివేదికలను గంగూలీ తరచుగా ఖండించేవారు. కానీ ఈ సారి గంగూలీ స్వయంగా తన బయోపిక్‌పై పనులు జరుగుతున్నట్లు ధృవీకరించారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.

    English summary
    Finally, Sourav Ganguly has said ‘yes’ to shoot his biopic. The former Indian captain’s biopic will be a big budget Bollywood film. here are the details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X