నిత్యామీనన్ బాలీవుడ్ ఎంట్రీ.. ఆమె హీరోయిన్ కాదు..హీరో: అక్షయ్ కుమార్
ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన 2.O మూవీ తర్వాత బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రం మిషన్ మంగళ్. మార్స్ అర్బిటర్ మిషన్ కోసం విశేష సేవలందించిన ఐదుగురు మహిళా సైంటిస్టుల కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నది. విడుదలకు ముందే వివాదాల్లో కూరుకుపోయిన ఈ చిత్రంలో విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పొన్ను, కృతి కుల్హరి, నిత్యామీనన్ నటిస్తున్నది. అక్షయ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ద్వారా నిత్యామీనన్ బాలీవుడ్‌లోకి ప్రవేశించడం గమనార్హం. ఈ సినిమా గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..

మిషన్ మంగళ్ గురించి
మిషన్ మంగళ్ చిత్ర కథ డిమాండ్ మేరకు హీరో కంటే హీరోయిన్లకే ప్రాధాన్యం ఎక్కువ. ఈ సినిమా కథలో వారే హీరోలు. ఐదుగురు హీరోయిన్ల సినిమాలో నేను హీరోగా నటించడం ఏ మాత్రం సిగ్గు అనిపించడం లేదు. ఈ స్థితిలో కూడా సినిమాలో నా పాత్ర నిడివి ఎంత అని చూసుకొను. సినిమాలో నా పాత్ర ప్రభావం ఎంతా అని చూసుకొంటాను. డేట్స్ అడ్జస్ట్ అయితే నచ్చిన పాత్రలను వదులుకోను.

గెస్ట్ రోల్ కాదని
మిషన్ మంగళ్‌లో నాది అతిథి పాత్ర కాదు. నామ్ షబానా చిత్రంలో మాదిరిగా చాలా కీలకమైన పాత్ర. నాది ఈ చిత్రంలో పూర్తిస్థాయి పాత్ర. ఆరుగురు హీరోలుగా ట్రీట్ చేయాల్సిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని అక్షయ్ అన్నారు.

కథ నచ్చడం వల్లే
నాతో క్లోజ్ రిలేషన్స్ ఉన్నందున వారు ఈ సినిమాలో నటించడం లేదు. కథ నచ్చడం వల్లే సినిమాను చేయడానికి ఒప్పుకొన్నారు. స్క్రిప్టు పూర్తిగా చదివి, స్క్రీన్ ప్లే నచ్చడంతోనే వారు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఆ తర్వాతే నా ప్రతిపాదనను, ఆఫర్‌ను అంగీకరించారు అని అక్షయ్ పేర్కొన్నారు.

మల్టీస్టారర్లు రావాల్సిన అవసరం
బాలీవుడ్‌లో ఐదారుగురు హీరోలు కలిసి నటించాల్సిన అవసరం ఉంది. గతంలో రాజ్ కుమార్ సమయంలో స్టార్ హీరోలందరూ కలిసి నటించేవారు. అగ్రహీరోలు కలిసి నటించిన జానీ దుష్మణ్, ఖాకీ లాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి కథలు ఇప్పుడు ఎందుకు రావడం లేదో అర్ధం కావడం లేదు అని అక్షయ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











